మహిళల క్లిటోరిస్ స్థానం ఎక్కడో, దాన్ని ఎలా తాకాలో కనిపెట్టడానికి పురుషులు పడే తాపత్రయం ఇంతా అంతా కాదు. పడక గదిలో మహిళలను సంతృప్తి పరచడానికి ఏకైక మార్గమేదీ లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. యోని అంగాలు, క్లిటోరల్ ఆర్గాజమ్ రెండూ వేర్వేరని, మెదడులో వాటి ప్రతిస్పందనల భాగాలు విడివిడిగా ఉంటాయని చెబుతున్నారు.
క్లిటోరిస్ ప్రసవం సమయంలో నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. యోని స్పందనలు, కామోద్రేకం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బట్టి ఉంటాయని చెబుతున్నారు. క్లిటోరిస్ స్పందనలు లేకున్నా ఆరోగ్యకరమైన మహిళలు లైంగిక క్రీడలో సుఖప్రాప్తి పొందతారని శాస్త్రవేత్తలు అంటున్నారు.
యోని ద్వారాలకు, క్లిటోరిస్‌కు మధ్య సంబంధం ఉంటుందని, క్లిటోరిస్‌తో సంబంధం లేకుండా యోని ద్వారాలు తెరుచుకోవని, అందువల్ల సంభోగంలో క్లిటోరిస్‌ను ప్రత్యేకంగా స్పందింపజేయాల్సిన అవసరం ఉండనది ఫ్రెంచ్ గైనకాలజిస్టు ఒడిలో బుయిసోన్ అంటున్నారు. యోని ఆర్గాజమ్స్‌ అనివార్యంగా క్లిటోరిస్ ఆర్జాజమ్స్ అవుతాయని ఆమె అంటున్నారు.
అయితే, ఆమె వాదనను ఇటీవలి పరిశోధనలు ఖండిస్తున్నాయి. క్లిటోరిస్ స్పందనలకు, యోని అంగాల స్పందనలకు మెదడులో వేర్వేరు భాగాలున్నాయనేది ఈ పరిశోధనల సారాంశం. క్లిటోరల్, సర్వైకల్, వజైనల్ స్టిమ్యులేషన్ ఓ క్లష్టర్ లాగా ఉంటుందని, ద్రాక్ష పండ్ల గుత్తిలాగా కాస్తా వేరుగా ఉంటాయని అంటున్నారు.