ముద్దు పెట్టుకోకపోవడం...
సెక్స్ చేస్తున్న సమయంలో చాలా మంది తన భాగస్వామిని ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన కూడా చేయరు. మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది. రతిభంగిమ ముద్దు పెట్టుకోవడానికి అనుకూలంగా లేకపోవడం కూడా అందుకు ఓ కారణం కావ్చచు. క్లైమాక్స్‌కు చేరుకోవాలనే తపనతో, రిథమ్ దెబ్బ తినకుండా ఉండాలనే తాపత్రయంతో ముద్దుకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సెక్స్ చేసే సమయంలో మీ భాగస్వామిని ముద్దు పెట్టుకుంటే ఆ అనుభవం మరింత మధురంగా ఉంటుంది.
భాగస్వామి రెడీ కాక ముందే కొరుకడం...
భాగస్వామిలో కామోద్రేకం కలగక ముందే కొందరు కొరకడం ప్రారంభిస్తారు. ఇది భాగస్వామికి అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుంది. శృంగారం రసపట్టులో ఉన్నప్పుడు కొరికితే ఆ నొప్పి కూడా తీయగానే ఉంటుంది. కానీ, భాగస్వామి సంసిద్ధం కానప్పుడు మాత్రం చిరాగ్గా ఉంటుందనేది గుర్తించాలి. అంతే కాకుండా తర్వాతి శృంగారం ఢమాల్ అనే ప్రమాదం ఉంది.
మిగతా శరీరాంగాలను పట్టించుకోకపోవడం..
లైంగికపరమైన అంగాలను మాత్రమే పట్టించుకుని మీ భాగస్వామి ఇతర అంగాలను విస్మరించడం సరి కాదు. మీ భాగస్వామి శరీరాన్ని మొత్తాన్ని పట్టించుకుని స్పర్శించడం, ముద్దులు పెట్టడం వంటి చర్యలు అవసరం. మోకాళ్లు, మణికట్లు, వీపు, కడుపు వంటి భాగాలు కూడా స్త్రీపురుషుల్లో శృంగార క్రీడను మోజులెత్తిస్తాయి.
భాగస్వామిపై భారాన్ని మోపడం...
పురుషులు మహిళలు తమపైకి వచ్చి సెక్స్ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అయితే, ఎక్కువ సేపు, భారాన్నంతా అతనిపై మోపితే సమస్య తలెత్తే అవకాశం ఉంది. స్త్రీలపై పూర్తిగా పురుషుడు తన శరీర భారాన్ని వేస్తే ఆమెకు ఊపిరాడని పరిస్థితి కూడా తలెత్తి రతిక్రీడ ఆనందం చెడే ప్రమాదం ఉంది.
అతి త్వరగా, ఆలస్యంగా క్లైమాక్స్‌కు చేరుకోవడం...
మీ భాగస్వామి స్థితిని పట్టించుకోకుండా సెక్స్‌లో అతి త్వరగా క్లైమాక్స్‌కు చేరుకోవాలనే తపన మంచిది కాదు. తగిన సమయంలో స్కలనం జరిగే విధంగా పురుషుడు నియంత్రణను అలవరుచుకోవాలి. చాలా ఆలస్యం జరిగితే కూడా ఆనందం ఆనుభవించే అవకాశం ఉండకపోవచ్చు. ఫోర్ ప్లేను ఎక్కువగా ఉపయోగిస్తే మంచిది.
క్లైమాక్స్‌కు ముందు భాగస్వామికి చెప్పకపోవడం..
రతిక్రీడను విరమించడానికి ముందు తాను క్లైమాక్స్‌కు చేరుకుంటున్నట్లు భాగస్వామికి చెప్పకపోవడం సరి కాదు. తాను క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాననే విషయాన్ని మహిళలు కూడా తన భాగస్వామి వద్ద వెల్లడించాల్సి ఉంటుంది. అలా చెప్పినప్పుడు భాగస్వామికి ఇంకా కావాలా, సరిపోతుందా అనే చెప్పే వీలు కలుగుతుంది. భాగస్వామి సంతృప్తి పొందకపోతే మరింతగా పొడిగించడానికి వీలవుతుంది.
సెక్స్‌ను పోర్న్ మాదిరిగా చూడడం...
శృంగార క్రీడను పోర్న్ లాగా చూడడం సరి కాదు. కొంత మంది రతిక్రీడ జరుగుతున్న సమయంలో బూతులు మాట్లాడడాన్ని ఇష్టపడుతారు. అది మీ భాగస్వామికి ఇష్టమా, కాదా అనే విషయం తెలుసుకోవడం మంచిది.
మౌనంగా ఉండడం...
శృంగార క్రీడ సమయంలో బెల్లం కొట్టిన రాయిలా ఉండకూడదు. మీ భాగస్వామికి మీ ప్రతిస్పందనలు అవసరమని గుర్తించాలి. మీరు ఏదైనా, మూలుగు లాంటి శబ్దమైన చేయాలి. ఎంతో బాగుందని, హాయిగా ఉందని వంటి చిన్న చిన్న మాటలు కూడా చెప్పవచ్చు.
యాంత్రిక చర్యలాగా...
శృంగారక్రీడను ఓ యాంత్రికమైన చర్యలాగా చేయకూడదు. అందులోని ఆనందాన్ని ఆస్వాదించడానికి సృజనాత్మకంగా వ్యవహరించడం అవసరం. సంభోగం ఓసారి మెల్లగానూ, మరోసారి వేగంగానూ చేస్తూ విభన్నతను చూపడం కావాలి.