రతిక్రీడ జరపాలనే కోరిక దహించి వేస్తున్నా కొంత మంది పురుషుల్లో అంగం గట్టిపడకపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. కామోద్రేకం సరిగా కలగనప్పుడు అంగస్తంభన జరిగిన కొన్ని సెకన్లలోని మళ్లీ యధాస్థితికి వచ్చేస్తుంది. అంగస్తంభన సరిగా జరగకపోతే తనకు ఆనందం కలగకపోవడమే కాకుండా తన లైంగిక భాగస్వామిని కూడా సుఖపెట్టడ లేడు.
మందు గుళికలు వాడడం, ఇతరత్రా వైద్య సలహాలు పొందడం, చికిత్స చేయించుకోవడం వంటివి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి. అంగస్తంభన సమస్యను పరిష్కరించుకోవడానికి సలహాలు పొందే మార్గాలు చాలా ఉన్నాయి. అంగం గట్టిపడిన తర్వాత ఎక్కువ సమయం నిలిచి ఉండడం లేదని కొద్ది పురుషులు ఫిర్యాదు చేస్తుంటారు. ఆ సమస్యను అధిగమించడానికి ఈ చిట్కాలు పాటించి చూడండి.
సరైన భంగిమను ఎంచుకోండి
శరీరంలో రసాయనిక చర్య పెరిగి, పురుషాంగంలోకి రక్తం ప్రవహించి, అది గట్టి పడడానికి పలు రతి భంగిమలు ఉపయోగపడుతాయి. శీఘ్ర స్కలనాన్ని నివారించడానికి, అంగం గట్టి పడడానికి మిషనరీ లేదా డాగీ స్టయిల్ బాగా ఉపకరిస్తుంది.
అతిగా సెన్సిటివ్ కావద్దు
దంపతులు సాధారణంగా కండోమ్స్ లేకుండా రతిక్రీడను ఎక్కువగా ఇష్టపడుతారు. స్పర్శ, సెన్సిటివిటీ కామవాంఛను పెంచుతుందనే విషయంలో సందేహం అవసరం లేదు. అంగం గట్టి పడుతుంది. అయితే, కొద్ది సమయంలోనే అంగం బలహీనపడి సాధారణ స్థితికి వస్తుంది. సెక్స్ చేసే సమయంలో అతిగా సెన్సిటివ్ కావడాన్ని వదిలేయాలి.
జీవనశైలి
అంగస్తంభన సమస్యకు అనారోగ్యకరమైన అలవాట్లు, ఆహారపు అలవాట్లు కూడా కారణవుతాయి. పౌష్టికాహారం వల్ల శరీర దార్డ్యం పెరిగి, లైంగిక క్రీడలో సత్తా చాటే శక్తి వస్తుంది. జీవశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే అంగస్తంభన భేషుగ్గా జరుగుతుంది. ఎక్కువ సేపు నిలబడుతుంది.
దురలవాట్లు మానండి
పొగతాగడం, మద్యం సేవించడం, ఈ రెండింటినీ కలిపి కొట్టడం కూడా అంగస్తంభన సమస్యను పెంచుతాయి. ఈ దురలవాట్లు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుంది. స్వభావసిద్ధంగా ఆనందాలను పొందేవాటిలో సెక్స్ కూడా ఒక్కటని గుర్తించండి.
స్వీయ నియంత్రణ
అంగం గట్టి పడి రతిలో చురుగ్గా పాల్గొనాలంటే స్వీయ నియంత్రణ అత్యంత కీలకమైంది. శీఘ్ర స్కలనాన్ని నివారించడానికి సంభోగాన్ని మధ్య మధ్యలో ఆపుతూ జోరును విడతలు విడతలుగా కొనసాగించండి.