కొందరు పురుషులు కొన్ని రకాలైన రతి భంగిమల వల్ల సెక్స్‌లో త్వరగా స్ఖలనం పొందుతారు. పూర్తిగా సంతృప్తినీ పొందుతారు. పురుషుడికి ఇష్టమైన భంగిమ, విధానం మహిళా భాగస్వామికి నచ్చకపోవచ్చు. దీన్ని చెప్పేందుకు సిగ్గుపడవచ్చు. భయపడొచ్చు. దాన్ని పురుషుడి పసిగట్టి ఆమె తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే విధంగా వ్యవహరించాలి.
రతిక్రీడ ఇద్దరి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా సాగాలి. అదే సమయంలో పరస్పరం సంతోష పెట్టుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండాలి. దంపతులు పొరపొచ్చాలు, విభేదాలు లేకుండా మాట్లాడుకోవాలి. అపుడే ఇరువురికి నచ్చిన, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. కొందరు స్త్రీలకూ అంగచూషణ అంటే ఇష్టం ఉండవచ్చు, పురుషులకు ఇష్టం లేకపోవచ్చు.
అలాగే కొందరు స్త్రీలు తమ వక్షోజాలను భర్త తాకటం వల్ల, మృదువుగా నొక్కటం వల్ల ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతారు. కొందరు పురుషులకు ఇది ఏమాత్రం ఇష్టం ఉండకపోవచ్చు. ఇలా ఒకరి ఇష్టాఅయిష్టాలను తెలుసుకుని శ్రుంగారంలో పాల్గొంటే వారు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారని అంటారు.
వ్యక్తుల సెక్స్ పరమైన అభిరుచులు వారు పెరిగిన వాతావరణాన్ని బట్టి, మత, కుల పరిస్థితులను బట్టి, వారు ఏర్పరుచుకునే నైతిక విలువలను బట్టి, జీవన విధానాన్ని బట్టి, జన్యువులను బట్టి మారుతూ ఉంటాయి. దాదాపు ఏ ఇద్దరిలోనూ ఇవి ఒకేలాగా వుండవు. కాబట్టి భార్యా భర్తలిద్దరూ ఏంతో కొంత సర్దుబాటు చేసుకోక తప్పదని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా, వివిధ రకాలైన పద్ధతులను, భంగిమల్లో సెక్స్ చేసుకునేందుకు ప్రయత్నించడం ద్వారా దంపతుల మధ్య సెక్స్ పరమైన సాన్నిహిత్యం పెరుగుతుంది. ఫలితంగా అది మంచి దాపత్యంగా రూపొందుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
అదేసమయంలో రతిక్రీడలో కొత్త పద్ధతులు నేర్చుకోవటం తప్పుగా భావించకూడదు. నిజానికి దాని వల్ల సెక్స్ అంటే నిర్లిప్తత, అనాసక్తి తగ్గి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఎవరైనా తమ లైంగిక ప్రవర్తనను మార్చుకోదలచుకుంటే అందుకు కొంత సమయం పడుతుంది. అందుకు ప్రయత్నించాలి.