లైంగిక క్రీడ వల్ల పలు ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. లైంగిక క్రీడకు దూరం కాకుండా ఉంటే పలు ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. జిమ్‌కు వెళ్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కన్నా లైంగిక క్రీడను క్రమం తప్పకుండా సాగిస్తే సుఖానికి సుఖం, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.
అదనపు కాలరీలను రతిక్రీడ కరిగించడమే కాకుండా వ్యాయామం అవసరం కూడా ఉండదని అంటున్నారు. లైంగిక క్రీడ జరిపే సమయంలో కాళ్లు, తొడలు, చేతులు, భుజాలు వంటి అన్ని శరీరాంగాల కండరాలకు వ్యాయామం లభిస్తుందని చెబుతున్నారు. సాధారణంగా రొటీన్ వ్యాయామం పదిహేను నిమిషాల పాటు సాగిస్తాం. అదే రతిక్రీడను పొడగిస్తే అంత వ్యాయామం చేసిన ఫలితం శరీరాకానికి దక్కుందని చెబుతున్నారు. ఫోర్‌ప్లే నుంచి సుఖప్రాప్తి జరిగే వరకు రతిక్రీడ సమయాన్ని పొడిగిస్తే లాభం ఉంటుందని అంటున్నారు.
శరీరానికి వ్యాయామం ఇవ్వడమే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా లైంగిక క్రీడ దోహదపడుతుందని చెబుతున్నారు. తలనొప్పి నుంచి, డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. వెంట్రుకలకు, చర్మానికి మెరుపు కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కదలికల వేగం, రతిక్రీడ పొడగింపు శరీరానికి ఎనలేని వ్యాయామాన్ని ఇస్తుందని చెబుతున్నారు. పలు రతిభంగిమలు ఇందుకు దోహదం చేస్తాయని అంటున్నారు. కొన్ని క్లిష్టమైన రతిభంగిమలకు ఎక్కువ శారీరక శ్రమ అవసరం. సులువైన రతిభంగిమల ద్వారా కూడా తగిన సమయాన్ని తీసుకుని రతిక్రీడను సాగిస్తే ప్రయోజనం చాలా ఉంటుందని చెబుతున్నారు.
మిషనరీ భంగిమ (పైన పురుషుడు)
భారతదేశంలో 90 శాతం మంది దంపతులు ఈ మిషనరీ భంగిమ ద్వారానే రతిక్రీడ సాగిస్తారు. ఇందులో పురుషుడు స్తీ శరీరంపైకి వచ్చి సంభోగం జరుపుతాడు. ఇందులో బరువును సమతూకం చూసుకునే చర్య ఇమిడి ఉంది. దీని వల్ల శరీరానికి ఎనలేని ప్రయోజనం కలుగుతుంది. పైన వెల్లకిలా పడుకునే స్త్రీకి కూడా సంభోగం సమయంలో శరీరానికి వ్యాయామం లభిస్తుంది.
పురుషుడు స్త్రీపైకి వచ్చి సంభోగం చేస్తున్నప్పుడు అతను శారీరక చర్య చాలా ఎక్కువగా ఉంటుంది. చేతులపై, భుజాలపై ఒత్తిడి పడుతుంది. సమతుల్యతను సాధించే ప్రయత్నంలో మోకాళ్లు, మోచేతులకు వ్యాయామం లభిస్తుంది. దాదాపుగా మోకాళ్లపైనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ భంగిమలో పురుషుడి శరీరానికి విపరీతమైన వ్యాయామం లభిస్తుంది.
పైన మహిళ
పురుషుడిపైకి స్త్రీ వచ్చి సంభోగం జరిపినప్పుడు మహిళకు సుఖప్రాప్తి త్వరగా జరుగుతుంది. అయితే, తాను పురుషుడిపైకి వచ్చి సంభోగించడాన్ని భారత మహిళలు ఎక్కువగా ఇష్టపడరు. అయితే, మహిళలు బిడియాన్ని వదిలేసి ఈ భంగిమ ద్వారా లైంగిక క్రీడలో చురుకైనా పాత్ర పోషిస్తే ఆమెకు సుఖాన్ని అందించడమే కాకుండా ఆమె శరీరానికి ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. దంపతులిద్దరికి సమాన స్థాయిలో ఆనందం కలుగుతుంది.
కిందికీ పైకీ ఓలలాడుతూ సెక్స్ చేస్తున్నప్పుడు మహిళ తన చేతులపై భారం పడుతుంది. వాటికి ఎక్కడలేని వ్యాయామం లభిస్తుంది. అదే సమయంలో పురుషుడు ఆమె శరీరాన్ని పట్టుకుని సమతూకంలో ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు.
స్త్రీ పైన ఉండి లైంగిక క్రీడ సాగిస్తున్నప్పుడు భారాన్ని ఎక్కువగా పురుషుడు మోస్తాడు. దానివల్ల పురుషుడికి ఎక్కువ వ్యాయామం లభిస్తుంది. మహిళ ఛాతీ కండరాలకు, ఇతర శరీర భాగాలకు వ్యాయామం లభిస్తుంది.