•  

మహిళలు కోరే 'పురుష' లక్షణాలేమిటి?

Manly qualities that women love in men
 
మహిళల్లో పురుషులు ఏం కోరుకుంటామనే విషయంపై ఎక్కువగా మనం చర్చిస్తుంటాం. కానీ, పురుషుల్లో మహిళలు ఏం కోరుకుంటారనేది కొంత రహస్యమే. మహిళలు ఎప్పుడు తమంత తాముగా పురుషులు ఇలా ఉండాలనే చెప్పరు. మహిళలు పొడుగ్గా, బలిష్టంగా, అందంగా, అంటే కండలు తిరిగి మగాడ్ని కోరుకుంటారని భావిస్తారు. స్త్రీ పురుషుడి శరీరాన్నే కాకుండా అతని ఉద్వేగపూరితమైన మనస్తత్వాన్ని కూడా కోరుకుంటుందట. అయితే, వారు కోరుకునే పురుష లక్షణాలు ఏమిటనేది చూద్దాం..శుభ్రంగా తయారు కావడం...పొడుగు అనేది ముఖ్యమే గానీ అంత ముఖ్యం కాదట. పురుషుడు తీర్చిదిద్దినట్లు ఉంటే చాలని నిపుణులు అంటున్నారు. అందంగా తయారు కావడం, శుభ్రంగా కనిపించడం మహిళలకు పురుషుల్లో కనిపించాల్సిన ప్రధాన లక్షణాలని అంటున్నారు. తలబిరుసుతనం, ఏదీ పట్టించుకోని తత్వాన్ని వారు ఇష్టపడరని అంటున్నారు. తన మీద తాను శ్రద్ధ చూపే పురుషుడు తమను కూడా బాగా చూసుకుంటాడని, తమ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాడని వారు భావిస్తారట. మహిళలను ఆకట్టుకోవాలంటే పురుషులు శ్రద్ధగా డ్రెస్ చేసుకోవాలి. గోళ్లు శుభ్రంగా ఉండాలి. మడత పడని దుస్తులు ధరించాలి. ఇది స్త్రీలను ఆకర్షించడానికి చాలా అవసరమని అంటున్నారు.స్టయిల్‌గా కనిపించాలి.....స్త్రీలకు పురుషులు స్టయిల్‌గా, ప్రత్యేకంగా కనిపించాలట. ఆధునిక ధోరణలుకు అనుగుణంగా అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఆఫీసుకు వెళ్లేప్పుడు ధరించే దుస్తుల మాదిరిగా ఉండాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ నీట్‌గా, ఆధునిక శైలులకు అనుగుణంగా ఉండాలని చెబుతున్నారు.నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి..పురుషులు సీరియస్‌గా ఉండడం కన్నా హాస్యప్రియులుగా ఉండాలని చెబుతున్నారు. మానసికంగా కృంగిపోయే విధంగా ఉండే పురుషులను వారు ఇష్టపడరని అంటున్నారు. నవ్వుతూ నవ్విస్తూ ఉండే పురుషుడంటే మహిళలు ప్రాణం ఇస్తారట. అయితే, ఇలాంటి సమయాల్లో ఇతరులను తప్పడమే పనిగా పెట్టుకోవద్దని, ఇతరులను కించపరిచే హాస్యానికి దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.ముఖ్యమనే విధంగా దువ్వాలి...నువ్వు బాగా ఉండడం నాకు కావాలనే విధంగా వ్యవహరించాలి. తనను జాగ్రత్తగా చూసుకుంటాననే హామీ ఇచ్చే విధంగా దువ్వాలి. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అప్రయత్నంగా చేయి అందుకోవడం, అప్పుడప్పుడు ముద్దులు పెట్టడం, కౌగిలించుకోవడం చేస్తూ ఉండాలి. ఆమెతో నడవడం తనకు ఇష్టమని విధంగా వ్యవహరించాలి. నీ తోడు నాకు చాలా అవసరమని చెప్పే విధంగా వ్యవహారశైలి ఉండాలి. చెప్పాలంటే, అధికారిలాగా కాకుండా మిత్రుడిలా ఉండాలి.సెక్సీ స్మయిల్...ఆమె కళ్లలలో కళ్లు పెట్టి చూస్తూ కొంటెగా నవ్వడాన్ని కూడా మహిళలు ఇష్టపడతారు. అలా చేసినప్పుడు మహిళ తన శరీర సౌందర్యం పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటుంది. మీకు దగ్గరవుతుంది.నింపాదిగా ఉండండి...మహిళలు ఎక్కువగా మాట్లాడుతారనే అబిప్రాయం ఉంది. అయితే, పురుషులు అలా వ్యవహరించరని కూడా అంటారు. కొంత మంది వాగుడు రాయుళ్లు కూడా ఉంటారు. పురుషులు ఎక్కువగా వాగడాన్ని, ప్రతి చిన్న విషయంపై హంగామా చేయడాన్ని మహిళలు ఇష్టపడరట. హుందాగా వ్యవహరిస్తే మెచ్చుతారట.English summary
It's not just about being tall, dark and handsome. There are certain 'manly' qualities about guys that can make any woman go weak in her knees. And while you may think it's all about the looks, guess what? There's more. It's a potent mix of both, physical attributes and of course, that all important emotional touch.
Story first published: Wednesday, November 21, 2012, 12:34 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more