•  

రతిక్రీడ గుండెపోటును తగ్గిస్తుందా?

Romance is helpful for health
 
రతిక్రీడ వేడికి శరీరంలోని కొవ్వు కరుగుతుందనే అభిప్రాయం ఉంది. అయితే అది అంత నిజం కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రతిక్రీడలో పాల్గొంటే రెండు మైళ్ళు జాగింగ్ చేసినట్లు అవుతుందనే అబిప్రాయంలో కూడా నిజం లేదని అంటున్నారు. అట్లని పూర్తిగా కొట్టిపారేయలేమని కూడా అంటున్నారు. శృంగార రసోల్లాసాలు కొద్దిపాటి వ్యాయామాన్నిస్తాయని తెలుపుతున్నారు.



రతిక్రీడ శరీరంలోని కొవ్వును కరిగించకపోయినా ఆరోగ్యవంతమైన గుండెను ప్రసాదిస్తుందని చెబుతున్నారు. పైగా సుఖమైన లైంగిక జీవితం మీలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తుంది. రక్తపోటు తగ్గించటానికి బాగా ఉపయోగపడడమే రతిక్రీడ వల్ల కలిగే ప్రధాన ప్రయోజమని సెక్స్ నిపుణులు, మేరేజ్ కౌన్సెలర్ ఇజ్రాయల్ హెల్ ఫాండ్ ధ్రువీకరించారు. రతి చర్యలు ఆనందాన్ని కలిగించే డోపమైన్ కార్టిసోల్ వంటి హర్మోన్ల విడుదలకు సహకరించి డిప్రెషన్‌ను దూరం చేస్తాయి. శక్తిని అధికం చేసి మనోభావాల్లో పూర్తిగా మార్పులు తెస్తాయి.



రతిక్రీడ వల్ల శరీరంలో కేలరీలు కూడా తగ్గుతాయి. అంతేకాదు, రతిక్రీడ వల్ల రక్త సరఫరా మెరుగుపడి తలనొప్పులు, సైనస్ వంటివి తగ్గుముఖం పట్టే అవకాశం వుంది. అందువల్ల తలనొప్పిని దూరం చేసుకోవడానికి ఉల్లాసరకమైన లైంగిక క్రీడను ఆహ్వానించడం మంచిది. ఆరోగ్యకర లైంగిక జీవితాన్ని అనుభవించేవారు సంపూర్ణ ఆరోగ్యం మిలమిలలాడుతారని అంటారు.



అటువంటివారే తరచుగా జిమ్‌లకు వెళ్ళడం, చక్కటి ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు చేసుకుంటారని సెక్సాలజిస్ట్ ఇయాన్ కెర్నర్ చెపుతారు. నిపుణులు తెలిపే అంశాలను పరిగణనలోకి తీసుకుని అత్యంత ఆరోగ్యకరమైన రతిక్రీడను కొనసాగిస్తే శారీరక, మానసిక ప్రయోజనాలు చేకూరుస్తాయని వివరిస్తున్నాయి.

English summary
Sex will help in health. It will keep away the heart attack. Healthy sex will make the man and woman to lead happy life.
Story first published: Saturday, October 13, 2012, 14:41 [IST]

Get Notifications from Telugu Indiansutras