భాగస్వామి సెక్స్ కోసం అంగలారుస్తున్న సమయంలో కొంత మందికి దాని పట్ల మనసు వెళ్లని సందర్భాలుంటాయి. నిజానికి, రతిక్రీడ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. దాంపత్య జీవనాన్ని సరళం చేసుకోవడానికి పనికి వస్తుంది. కొంత మంది దంపతుల్లో ఒక్కరు నిత్యం సెక్స్ కావాలని మారం చేస్తుంటే మరొకరికి అంతగా ఇష్టం ఉండదు. అలాంటి సందర్భాల్లో దంపతుల మధ్య ఘర్షణలు చెలరేగడం సాధారణంగా మారుతుంది. తమ గర్ల్ ఫ్రెండ్ నిత్యం సెక్స్ కావాలని ఒత్తిడి పెడుతుందని కొంత మంది పురుషులు ఫిర్యాదు చేస్తుంటారు. అటువంటివారిని మీ దారిలోకి తెచ్చుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
చర్చించండి
ఒక్కసారి సెక్స్ జరిగిన తర్వాత కూర్చుని నింపాదిగా మీ గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడండి. మీ సమస్యలేమిటో చెప్పండి. తీవ్రంగా అలసిపోయిన తర్వాత సెక్స్ చేయడం కష్టమవుతోందని చెప్పండి. మిత్ర సమ్మితంగా చెప్తే ఆమె కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఘాటుగా చెప్తే గొడవ జరిగి నిద్ర కూడా కరువయ్యే ప్రమాదం ఉంది.
బానిస అయిందా?
ఆమె ప్రతిస్పందనను జాగ్రత్తగా పరిశీలించండి. నిజంగానే ఆమెలో కామవాంఛ ఉందా, అదో అలవాటుగా మారిందా అనేది పరిశీలించాలి. క్రమం తప్పకుండా ఆమెతో సంగమించి, కొన్నాళ్ల తర్వాత తగ్గిస్తే అది ఆమెను ఇబ్బందులకు గురి చేయవచ్చు. సెక్స్ లేకపోతే నిజంగానే ఓర్చుకోగలదా, లేదా అనేది గమనించాలి. సెక్స్‌కు బానిస అయినవాళ్లు ఇతరులతో సంబంధాల వైపు మొగ్గు చూపవచ్చు.
వదిలేస్తూ ఉండడం
సెక్స్‌కు దూరంగా ఉండడం సాగించాలి. ఆమె సెక్స్ కోసం అడిగినప్పుడు ఏదో సున్నితంగా సమాధానం చెప్పి దూరంగా వెళ్లండి. ఆమె మనసు నొప్పించే విధంగా ఉండకూడదు. సెక్స్ కావాలన్నప్పుడు ఆమెను ముద్దు పెట్టుకోండి, చేతులతో స్పర్శించండి.
వీకెండ్స్ స్పెషల్స్
వారమంతా మీ భాగస్వామిని సెక్స్‌తో అంతగా సంతృప్తిపరచలేనప్పుడు వారాంతాలను ఎంపిక చేసుకోండి. ఆమె ఊహకు కూడా అందకుండా మీరు ఆమెతో సెక్స్‌కు సిద్ధమై, దాంట్లో మునిగి తేలి, ఆమెకు ఆనందాన్ని, మాధుర్యాన్ని అందివ్వండి. ఆమె ఆశ్చర్యచకిత అయ్యలా ఉండాలి. ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమెను కౌగలించుకోండి. ఆమె శరీరంలోని వివిధ అంగాలను, వక్షోజాలను స్పర్శించండి. ఆ తర్వాత రంగంలోకి దూకండి. దీనివల్ల ఆమె పట్ల మీరు వైముఖ్యం ప్రదర్శించడం లేదని, ఆమెను అద్భుతంగా కోరుకుంటున్నారని సంకేతాలు వెళ్తాయి. దానివల్ల మీ గర్ల్ ఫ్రెండ్ మీ పట్ల మరింత ప్రేమను పెంచుకుంటుంది.