ముద్దు వల్ల ఆనందం కలిగి ఆరోగ్యం ఉత్తేజం తదితర సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. ముద్దుల వల్ల మనుషుల్లో మార్పులు, ఉత్తేజం కలగడం, మస్తిష్కంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుందని చెబుతున్నారు. దీంతో సెక్స్ కోరికలు విచ్చుకుంటాయని పరిశోధకులు చెపుతున్నారు.
చుంబనాల వల్ల మీలోని హార్మోన్లు మీ పార్టనర్ శరీరంలోకి ప్రవేశించి ఇద్దరిలోనూ ఆ ప్రభావం ఉంటుందంటున్నది పరిశోధకుల వాదనగా ఉంది. ఇది కేవలం రెండు పెదవుల స్పర్శ వల్ల మస్తిష్కంలో తీవ్రమైన అలజడి రేగి ఉద్రేకాన్ని పెంచుతుందని వారు వాదిస్తున్నారు.
ఈ ముద్దు అంశంపై 15 జంటలను ప్రత్యేకంగా ఎంపిక చేసి ముద్దులకు ముందు, ముద్దుల తర్వాత వారిలో ఉత్పత్తి చెందే ఆక్సీటానిక్, కోర్టీసోల్ హార్మోన్ల శాతాన్ని నిపుణులు లెక్కవేశారు. ముద్దుల తర్వాత ఆక్సీటానిక్ హార్మోన్లు వారిరువురిని దగ్గరకు చేరదీయడమే కాకుండా, కోర్టీసోల్ హార్మోన్ శరీరంలో వేడిని పుట్టించి కామోద్దీపనాన్ని మేల్కొల్పుతుందని పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.
అందుకే ముద్దూ మురిపాలు ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ముద్దంటే చేదు కాదని, తీయదనమని మన పెద్దలు అనుభవం ద్వారానే చెప్పి ఉంటారు. నీరసపడిపోయి ఇంటికి వచ్చే మీ జీవితభాగస్వామి పెదవులుపై ముద్దులు అది పరీక్షించుకోండి.