•  

రతిలో టాప్ లేపాలంటే, కొన్ని వదిలేయాలి

Few tips to enjoy romance
 
శృంగార జీవితం ఆనందంగా ఉంటేనే దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలపేముంది అని అనిపిస్తుంది. అయితే, తీరికలేని రోజువారీ పనులు, ఉద్యోగాల ఒత్తిడి వంటివి దంపతుల శృంగార జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. రతిక్రీడకు దంపతులు సరైన సమయాన్ని, ఏకాంతాన్ని పొందలేకపోతున్నారు. కొన్ని అలవాట్లు కూడా దానిపై ప్రభావం చూపుతున్నాయి. ఆరోగ్యకరమైన, మధురమైన శృంగార జీవితాలు గడపాలంటే, జంటలు కింది అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. రతి అనందాన్ని తనివితీరా జుర్రుకోవాలంటే వదిలేయాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. వాటిని చదవండి -ఆలస్యంగా రావడం - కార్యాలయంలో పని ఒత్తిడి వల్ల ఇంటికి ఆలస్యంగా రావడం అందులో ఒక్కటి. ఆ కారణంగా మీ భాగస్వామిని మరిచిపోవాల్సిన అవసరం లేదు. బాస్‌ను సంతోష పెట్టటమే కాదు మీ భార్యను కూడా సంతోష పెట్టాలి. ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు బుట్టెడు మల్లెలు తెచ్చి మీ భార్య మూడ్ సెకండ్లలో మార్చేయండి. దగ్గరగా వెళ్ళి మీ మునివేళ్ల స్పర్శతో మేజిక్ చేయండి.సెల్ ఫోన్ న్యూసెన్స్ - మీ ఆవిడ దగ్గరగా ఉంటే సెల్ ఫోన్ మూలన పడేయండి. ఆధునిక కాలంలో పురుషుడు లేదా స్త్రీకి రతిక్రీడ సాగించే సమయంలో దాన్ని మించిన శత్రువు లేదు. సరిగ్గా రతి సగంలో మీ ఫోన్ ఇక ఆపేయ్ అంటూ అలారం కొడితే....ఇద్దరి మూడ్ చెడిపోతుంది. ఆఫీస్ పని ఇంటికి తేకండి. మరీ అర్జంట్ కాల్ అయితే, తక్కువగా మాట్లాడి కట్ చేయండి.నిద్ర - రతిలో మీరు వారానికి కనీసం 3 లేదా 4 సార్లయినా చురుకుగా పాల్గొనాలి. రతి మీ ఒత్తిడి దూరం చేస్తుంది. అది కూడా ఒక ఆరోగ్యకర వ్యాయామమే. బరువు తగ్గిస్తుంది. విసుగెత్తించే మీ జీవితాలకు చక్కటి భంగిమలు ఆహ్లాదాన్నిస్తాయి. రతి తర్వాత వెంటనే గుర్రుమంటూ నిద్రించకండి. మీ మహిళను కౌగిలించి సంభాషించండి. మహిళలు దాన్ని కోరతారు.స్నేహితులంటూ అధిక సమయం గడపకండి- స్త్రీలకు, పురుషులకు ఇదొక చెడు అలవాటే. మీ భాగస్వామికి మించిన స్నేహితులు లేరనే భావనకు రావాలి. మీ స్నేహితుడితో బీర్ కొడుతూ కూర్చునేకంటే మీ భాగస్వామి వద్దే ఆ పని చేయండి. వైన్ వంటిది కోరిక ఆమెలో కూడా రగిలిస్తుంది. కనుక ఈ డ్రింక్ తో మీ జీవితం ఆనందించండి. అదికూడా ఎపుడైనా ఒకసారి సిప్ చేస్తే మీ రతిలో టాప్ లేపుతుంది.ఇతరేతర అలవాట్ల కన్నా మీ భాగస్వామితో రతిక్రీడను పంచుకునే అలవాటు చేసుకుంటే జీవితం సుఖమయం, సరళం అవుతుంది.English summary
Men or women should avoid few habits to make sexual life happy. You should avoid coming late to the house from office. Dom't waste time with chit chat with friends and drinks
Story first published: Friday, September 7, 2012, 12:26 [IST]

Get Notifications from Telugu Indiansutras