కొంతమంది పురుషులు మహిళ కనపడితే చాలు, పరిసరాలు మర్చిపోతారు. ఏదో ఒక అంశం మొదలు పెట్టి ఆమె పరిస్ధితి కూడా ఆలోచించకుండా ఆనందించేస్తూ ఉంటారు. తన పక్కన ఎవరున్నారనేది కూడా అటువంటివారు చూడరు. భార్య ఉన్నా, ప్రేయసి ఉన్నా వారి దోవ వారిదే. వారితో అతనికి తగవులు తప్పవు. మరి అతను సంభాషించే వ్యక్తి కూడా రంగంలోకి దిగితే....సమస్యలు చాలా వస్తాయి. అటువంటి పురుషులను ఎలా వ్యవహరించాలనేది పరిశీలించండి.
సంభాషణలో పురుషుడు మీ మహిళా స్నేహితులగూర్చి అధికంగా చర్చిస్తున్నాడా? మీతో సంభాషించటం కన్నా మీరు వారి మాటలు చెపుతూంటే, తరచి, తరచి అడిగేస్తున్నాడా? ఏదైనా పార్టీకి వెళ్ళినపుడు మిమ్మల్ని ఆనందించమని వదిలేసి అతనికి గాల్ ఫ్రెండ్స్ గా చెప్పబడే వారితో గడిపేస్తున్నాడా? ఈ రకం వ్యక్తులు సాధారణంగా అబద్ధాలు కూడా చెప్పేస్తారు. ఆఫీస్ లో ఉన్నానని చెపుతూ ఆమ్మాయిలతో కూడా గడిపేస్తారు. రాత్రయినా...పగలయినా వీరికి రంధ్రాన్వేషణే ప్రధానంగా తిరిగేస్తారు.
మీరు రూమ్ లో అతని వద్ద వున్నప్పటికి ఇతర మహిళలతో మాట్లాడేస్తూ సమయం గడుపుతున్నాడా? ఆ సమయంలో అతను ఎలా స్పందిస్తున్నాడు? అతను గాళ్ ఫ్రెండ్స్ ని బేబీ, స్వీట్ హార్ట్ అంటూ సంబోధించి ఫోన్ లోనే ముద్దు చేస్తున్నాడా? మీ బాయ్ ఫ్రెండ్ తో ఇతర మహిళల అఫైర్స్ ఏమైనా వినటం జరిగిందా? వీటన్నిటికి మీ జవాబు .....అవును...అయితే, మీ పురుషుడు పిల్లల వెంట పడే రకమే. మహిళలంటే మహా ఇష్టం అని చెప్పచ్చు. మరి దానిని నియంత్రణ చేయాల్సింది మీరే. అతను వ్యవహరించే మహిళ కూడా అటువంటి రకమే అయితే, మీ వివాహ జీవితం సమస్యలలో పడుతుంది. లేదంటే ఏదో ఒక రోజు మీకు కూడా మోసం జరిగిపోతుంది. కనుక ఆలస్యం కాకుండానే అతనిని ఏదో ఒకరకంగా దారిమళ్ళించి నియంత్రించండి.
ఏదో మీ అదృష్టం కొద్ది తరచుగా ఆనందింపజేసే పురుషుడు దొరికాడు. మీరు అనుమానిస్తే తప్ప తానేంచేస్తున్నాడనేది కూడా మీకు చెప్పడు. కనుక ఈ విషయాలలో అతడిని అనుమానిస్తూ, తప్పు పడుతూ విషయాన్ని మరింత సీరియస్ చేసుకొని బాధలు పడే బదులుగా, మీకు తెలియనట్లు వుంటూ అతడిని మరోమారు మీ చెప్పు చేతల్లో వుంచుకోటానికి ఏం చేయాలనేది ప్రణాళిక చేసి అమలు చేయండి. సైకాలజిస్టుల మేరకు ప్రతి పురుషుడికి కొంత పురుషుడిని అనే అహంకారం వుంటూ వుంటుంది. దానిని తృప్తి పరచాలంటే, కొంతమేరకు మీరే సంయమనం పాటించి అతడిని చేయిదాటకముందే మీ దారిలోనడిచేలా చేసుకోవాలంటారు వీరు.