•  

ఆమె లేదా అతను అవసరం కంటే మించి ఆనందిస్తే....!

 Signs You Are Becoming A Romance Addict!
 
మీకు సెక్స్ పిచ్చి పట్టిందనేందుకు కొన్ని లక్షణాలు పరిశీలిస్తే...? సెక్స్ చేస్తూ వుంటే ఎంతో తమాషాగా వుంటుంది. అయితే, కొన్ని సార్లు అది ప్రమాదకరంగా కూడా వుంటుంది. ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ లైంగికతలో ముణిగిపోయే వారిని సెక్స్ పిచ్చిగాళ్ళని అంటారు. ఆరోగ్యకరమైన, చురుకైన లైంగిక జీవితం శరీరానికి మంచిదే, కాని అవసరం కంటే మించి రతిని ఆచరిస్తే, అలవాటు పడిపోతే అది మిమ్మల్ని ఒక పిచ్చి వాడుగా తయారు చేస్తుంది.ఎవరితోనో ఒకరితో శారీరక సంబంధం ఏర్పరచుకోవడం, ఆనందించేయడం అనేది ఒక కోరిక. మీరు ఎల్లపుడూ సెక్స్ గురించి ఆలోచిస్తారు. ఎపుడు పడితే అపుడు ఆ పనికి సిద్ధ పడిపోతారు.
మరి మీరు సెక్స్ పిచ్చిగాళ్ళా కాదా అనేది తెలుసుకోవడం ఎలా?బూతు బొమ్మలు - మీరు బూతు బొమ్మలంటే ఇష్టపడుతూ వాటిని చూస్తారా? అలాగయితే మీ కోర్కెలు నియంత్రించుకోండి మీరు దానికి అలవాటు పడ్డారా? లేదా అనేది సరిచూసుకోండి. మీరు దానిని నియంత్రించుకోలేకపోతే, ప్రతిరోజూ బ్లూ ఫిలిం వీడియోలు చూస్తుంటే, మీరు సెక్స్ పిచ్చిగాళ్ళని సంకేతం. మరీ ఆలస్యం కాకముందే, మీ అశ్లీల చిత్రాల చూపు నియంత్రించండి.హస్తమైధునం లేదా రతి - ప్రతిరోజూ రాత్రి అయ్యిందంటే అదే యావలో వుంటారా? హస్తమైధునం మంచిదే...కాని దీనికి లోబడిపోవటం మీ లైంగిక జీవితానికి హాని కలిగిస్తుంది. సెక్స్ చేసిన తర్వాత కూడా మీరు సంతృప్తి పడక మరల ఆ పని చేసుకోవాల్సిందే. రెండు రోజులు రతి చేయకుంటే మీకు విసుగనిపిస్తుంది. ఈ లక్షణం మీరు రతి పిచ్చిగాళ్ళనిపిస్తుంది. ఒక వారంపాటు మీ లైంగిక కోర్కెలు మరచిపొండి అపుడు మీలోని మార్పు గమనించండి.మోసం - మీరు సెక్స్ పిచ్చిగాళ్ళయితే, ఎవరు దొరికినా సరే రతి చేస్తారు. మీ పార్టనర్ కు ప్రేమించే మూడ్ లేకపోయినా లేదా ఆమె అంటే బోర్ కొట్టేసినా సరే... కొత్త పార్టనర్ ని పట్టి అయినా సరే ఆనందించేస్తారు. మరి ఈ రకంగా మీ పార్టనర్ ను మోసగించి పక్కదోవలు పట్టేయడం, మీకు సెక్స్ పిచ్చి పట్టిందనే దానికి నిదర్శనం.బలాత్కారం - పార్టనర్ ఆ రోజు రతికి సిద్ధంగా లేదు. మరి మీరు కూడా సాధారణంగా అయితే ఆ రోజుకి మీ పార్టనర్ కి సౌకర్యం లేదు కనుక రతి మానేస్తారు. కాని, మీరు మీ పార్టనర్ ని ఆమె లేదా అతని కోరికకు వ్యతిరేకంగా రతికి ఒప్పించి ఆచరించేస్తే, మీరు సెక్స్ పిచ్చ పట్టిన వారు.మీరు సెక్స్ పిచ్చి పట్టినవారనేటందుకు ఇవే లక్షణాలు. ఎల్లపుడూ మీరు రతి గురించి, స్వయం ఆనందం మెళకువలు గురించి ఆలోచిస్తూంటే, కొంచెం నియంత్రించుకోండి. ఈ పిచ్చి మొదటి దశలోనే వైద్య సహాయం వంటివాటితో పోగొట్టుకోవాలి. సెక్స్ పిచ్చి పట్టడం, మీ వ్యక్తిగత సంబంధాలకు హాని కలిగిస్తుంది. మీరు అనుకున్నట్లు అంశాలు జరుగకుంటే, మీరు మీ పార్టనర్ ని శారీరకంగా హింసించటం కూడా చేస్తారు. కనుక త్వరితంగా నియంత్రించుకొని ఆరోగ్యకరమైన రతిక్రీడలను ఆచరించండి.English summary

 These are few signs to know if you are becoming a Romance addict. If you are only thinking about or self pleasure techniques all the time, it is time to become aware. This addiction can be cured in the earlier stages but, if you notice it later, you have to consult sexologists and get over this addiction with a medical help. Romance addiction is harmful for your personal relationships.
Story first published: Friday, June 15, 2012, 14:21 [IST]

Get Notifications from Telugu Indiansutras