•  

ఎంత చేసినా....మహిళకు మేచింగా?

Myths About Masturbation Busted!
 
హస్తమైధునం అతనిలో అతను లేదా ఆమెలో ఆమె అద్భుతంగా ఆనందించుకోవటానికి చేసే వ్యక్తిగత చర్య. శరీరంలోని జననాంగాలను ఉత్తేజపరచి, స్కలనం చేసుకోవడం, భావప్రాప్తి పొందడం హస్తమైధునంలోని ప్రధాన లక్ష్యం. లైంగికంగా ఆనందించటానికి యువతులు, యువకులు ఎవరికి వారు దీనిని చేసుకుంటారు. ఈ చర్యలు వ్యక్తికి యౌవనం వచ్చేసరికి మొదలవుతాయి. పెద్దవారి లోకంలోకి అడుగుప్టేటటప్పటికి పిల్లలకు ఈ హస్తమైధున ఆలోచనలు వచ్చేస్తాయి. కాని హస్తమైధునంగురించి ప్రతివారికి అనేక అపోహలున్నాయి. అవేమిటో పరిశీలిద్దాం.
లైంగికతకు ఆకర్షించబడితే హాస్తమైధునం అలవాటవుతుంది - పిల్లలు టెలివిజన్ ఛానెల్స్ లో బ్లూ ఫిలింల వంటి అశ్లీల చిత్రాలు చూడరాదని అంటారు. కాని హస్తమైధునం అనేది వ్యక్తి లైంగికతలకు అలవాటు పడితేనే జరిగేది కాదు. శరీరంలో లైంగిక హార్మోన్లు ఉత్పత్తి అయి పిల్లవాడు హస్తమైధునం గురించి, సెక్స్ గురించి తెలుసుకోవాలని భావిస్తాడు.

పురుషులే హస్తమైధునం చేసుకుంటారు - ఇది కూడా అపోహ. సాధారణంగా అందరూ భావిస్తారు. కాని యువతులు సైతం హస్తమైధునంచేసుకుంటారు. మహిళలు చేసుకుంటారని అనుకోవడం సమాజం ఒప్పుకునే చర్య కాదు. మహిళలు కూడా తాము చేసుకోమని కొట్టిపారేస్తారు. కాని వారు కూడా హస్తమైధునాలు చేసుకుని భావప్రాప్తి కలిగించుకుంటారనేది ఒక వాస్తవం. కాని అది బయటకు తెలిస్తే సమాజం వారిని వ్యతిరేకిస్తుందనే భావనతో వారు బయట పెట్టరు.

హస్తమైధునం వీర్య కణాలను తగ్గిస్తుంది - కొంతమంది పురుషులు హస్తమైధునం వీర్యకణాలను తగ్గిస్తుందని భావిస్తారు. కాని వాస్తవం ఏమంటే, హస్తమైధునానికి, వీర్యకణాల సంఖ్యకు సంబంధం లేదు. శరీరం క్రమం తప్పకుండా ఎల్లపుడూ వీర్యకణాలను ఉత్పత్తి చేస్తూనే వుంటుంది. కనుక ఈ అపోహ సరికాదు.

ఆనందం లేకనే మీరు హస్తమైధునం చేస్తారు - ఇది కూడా అపోహ మాత్రమే. హస్తమైధునానికి అలవాటు పడినవారు వాస్తవ సెక్స్ చేసిన తర్వాత కూడా దానిని చేసుకోటానికి ఇష్టపడతారు. ఆనందపడటానికి ఇదొక మార్గంగా భావిస్తారు. మహిళలు కూడా హస్తమైధునంతో స్కలనం చేసుకోటానికి, మరియు సెక్స్ చేసుకోటానికి రెండిటిని రెండు ఆనందాలుగా ఆనందిస్తారు.

హస్తమైధునం అనారోగ్యం - ఇది తప్పు. హస్తమైధునం ప్రయోజనాలు చాలా వున్నాయి. ఎంతో ఆనందం తృప్తి కలుగుతాయి. అది ఆనందం ఇవ్వటమే కాదు, ఒత్తిడినుండి కూడా దూరం చేస్తుంది. మీకు సెక్స్ జీవితం లేదనుకుంటే, హస్తమైధునం చేసుకొని జీవించండి.

హస్తమైదునం మీకు పిల్లలు కలుగకుండా చేస్తుంది - పిల్లలుగా వున్నపుడు, క్రమం తప్పకుండా వీర్యం అధికంగా తయారవుతుంది. మీరు కూడా చిన్నతనంలో చేసుకునే వుంటారు. మీ స్నేహితులు చేసుకోవడం చూసే వుంటారు. కాని తర్వాతి రోజులలో వివాహాలవడం పిల్లలను కనటం వంటివి ఎన్నో జరిగిపోయాయి. కనుక హస్తమైధునం చేసుకునేవారికి పిల్లలు కలుగరనేది తప్పుడు భావన. హస్తమైధునం ఫలదీకరణలను ఏ మాత్రం వ్యతిరేకంగా ప్రభావించదు.

హస్తమైధునం గురించి ఇవి కొన్ని అపోహలు. పురుషులు స్త్రీలు కూడా ఈ చర్యలు చేసి తమలో తాము విభిన్న రీతిలో ఆనందిస్తారు. అయితే, సురక్షితంగా వుండాలంటే, హస్తమైధునంలో జాగ్రత్తగా వుండండి. శుభ్రమైన చేతులు లేదా ఇతర సాధనాలు ఉపయోగించండి. మీ అంగానికి హాని కలుగకుండా చూసుకోండి. లేకుంటే, మీరు కష్టాలలో పడిపోతారని గ్రహించండి.

English summary
These are few myths about masturbation. Both men and women indulge in this activity to attain pleasure. However, to be on the safer side, be careful while masturbating. Use clean hands or props. Do not hurt yourself or else you might fall into trouble.
Story first published: Thursday, June 14, 2012, 15:56 [IST]

Get Notifications from Telugu Indiansutras