ఇవే ప్రధానంగా తొమ్మిది అంశాలను ప్రతిరోజూ ప్రేమ అనే పుస్తకం పేరిట జూడీ ఫోర్డ్ అనే ఒక సైకో ధిరపిస్టు వ్రాశారు.
మొదటగా స్కలనం
రాత్రి అద్భుతంగా ఆనందించాను. అదిరేటి భంగిమ ఆచరించావు డియర్ అంటూ మెచ్చుకోండి. మీరు కనుక నాకసలు నీవు చేసింది తెలియదు, ఛండాలంగా అంత నిదానంగా చేశావా? అంటే...అతడు చిన్నబుచ్చుకుంటాడు.
పిల్లల వ్యవహారం - పిల్లల కెరీర్లు, చదువులకు సంబంధించి అతను చేసే ప్రతి పనిని మీరు అభినందించాలి. ఆ విషయంలో కనుక మీరు ఏ మాత్రం నిందించినా, అతను బాగా కోపిస్తాడు. మిమ్మల్ని వెంటనే ఏదో విషయాలకు నిందిస్తాడు. కనుక పిల్లల విషయంలో బాగా వ్యవహరిస్తున్నావని తెలుపండి.
ఉద్యోగం - ఖాళీగా ఇంట్లో వుంటున్నాడా? కొత్త ఉద్యోగం ఎపుడు వెతుక్కుంటావ్ ...అని అడగకండి. అది అతనికి కోపాన్నిస్తుంది. ఈ అంశం కూడా చాలా చాకచక్యంగా పరిశీలిస్తూ అతని ప్రయత్నాలు తెలుసుకోవాలి.
మా అమ్మ చెప్పింది... - నీవు ఇలా చేయాలని మా అమ్మ చెప్పింది, తర్వాత నీ ఇష్టం అంటూ అతనిని హెచ్చరించకండి. చాలా బాధ పడతాడు.
నీవు వదిలేయ్..నేను చూస్తాను? - నీవు దానిని లేదా ఆపని వదిలేయ్ నేను నా అంతట చేసుకుంటాను. అనే మాటలు అతనిని బాధిస్తాయి. అది అతనేదో తప్పు చేస్తున్నట్లు, మీరైతే సరిగా చేస్తారనేట్లు వుంటాయి. కనుక ఈ పదాలు వాడకండి.
నీవు ఎపుడూ - నీవు ఎపుడూ అంతే, లేదా నీవు ఎప్పటికి మారవు వంటి పదాలు అతనికి కోపం తెప్పిస్తాయి.
ఆరోగ్య భయం - నీవు నిజంగా దానికి భయపడుతున్నావా? పేంటు తడుపుకున్నావా? అనే పదాలు వాడకండి. అలా అంటే అతనిని మీరు అవమానించినట్లు భావిస్తాడు.
స్నేహితుడు - అబ్బా నీ స్నేహితుడు మరల వచ్చాడా? - ఇది అతను భరించలేడు. అతనొస్తే నీవు బయటకు వెళ్ళకు అంటే చాలా కోపగించుకుంటాడు.
పిల్లలు - చివరగా...పిల్లలను చూస్తూ వుండు. అక్కడికే తీసుకు వెళ్ళు. వారిని అక్కడ ఇక్కడ తిప్పమాకు. అని అనకండి. అతను కూడా వారికి భాధ్యతగల తండ్రి అని గుర్తించండి.
ఈ రకమైన పద ప్రయోగం అతనికి మీకు మధ్య కొన్ని మార్లు అగాధాన్ని ఏర్పరుస్తుంది. ఈ రకమైన తగవులు అధికం అయితే, అది మీ సంబంధాలను సైతం పాడు చేస్తుంది. కనుక పురుషుడి అహంకారం చల్లార్చాలంటే, మహిళలు, పై విషయాలు తగురీతిలో ప్రస్తావించాలి.