•  

మహిళ చెల్లించే మూల్యం .....అదొక్కటేనా?

The Price Women Pay for Relationships?
 
హిళలకు సంబంధం కావాలి, ఆసంబంధం కొరకు వారు తమ శీలాన్నికూడా పణంగా పెడతారు. అంతే కాని వారికి రతి అనేది ఆనందంకాదంటూ ఇటీవల రచయిత స్టెఫెన్ ఫ్రై ఒక ప్రకటన చేసి సంచలనం రేకెత్తించాడు. అయితే, ఈ సంచలన ప్రకటను చాలామంది మహిళలు....లేదు లేదు, మాకు సెక్స్ అంటేనే ఇష్టం, అదే మాకు కావాలి అనే ధోరణి కూడా కలిగి వుంటారు.

చాలామంది ఈ నమ్మకాన్ని కొట్టిపారేస్తారు. సంబంధం కొరకు సెక్స్ మూల్యంగా చెల్లించటం అంతా చెత్త అని తోసిపారేస్తారు. నేడు మహిళలు స్వంతంగా సంపాదనాపరులు. అంతేకాదు, గతంలో వలే కాకుండా గర్భాలను కూడా అరికట్టుకోగలరు. కనుక సంబంధం కొరకు సెక్స్ పణంగా పెట్టటం వారు చేయకపోవచ్చు. నేటి మహిళపురుషుడితో తనదైన శైలితో వ్యవహరిస్తోంది. బహుశ పురుషుడు కొన్ని దశాబ్దాల కిందట వ్యవహరించిన విధంగా నేడు ఆమె అతడిపై ఆధిపత్యం చలాయిస్తోంది.

మరి ఇక మహిళలు ఏమంటారో చూడండి....
మహిళ తనకవసరమైన పురుష సంబంధం కొరకు సెక్స్ ను మూల్యంగా చెల్లించటం లేదు. ఒక భావోద్రేక అనురాగంతో పురుషుడిని ఆశ్రఇస్తోంది. ఆమె దృష్టిలో సంబంధం కలిగి వుండటం ప్రధానం అవి హృదయానికి సంబంధించినవి. ప్రతిఒక్కరికి తమ సంతోషాలను, దుఖా:లను పంచుకోవాలంటే ఒక సంబంధం వుండాలి. దానికిగాను అనుబంధం అవసరం. మరి పురుషులు కూడా నేటిరోజులలో మహిళలవలే అనుబంధాలు, అవగాహన కలిగే వున్నారు.

మరి మహిళలు సెలిబ్రటీలు, సంపాదనా పరులుగా మారినప్పటికి పురుషుడితో సంబంధం ఎందుకుకావాలనుకుంటారు? ఆమెకు కావలసింది భద్రత, మంచి సంబంధం ఆమెకు ఎంతో భధ్రతా భావాలనిస్తుంది. మహిళలు కామాన్ని కోరతారు. ఆనందిస్తారు. మనంప్రేమించే వారితో అద్భుత సెక్స్ కార్యం చేసేస్తాం. మంచి సంబంధం లైంగికతను ఆనందింపచేస్తుంది. మంచి లైంగికత కామాన్ని పెంచుతుంది.

లైంగిక జీవితం పురుషులకు ఎంత కావాలో, మహిళలకూ అంతే ప్రధానం.అయితే మహిళ సంబంధాలను పెంచనూ గలదు, తుంచనూ గలదు. మహిళ పురుషుడి జీవితంలో అనేక పాత్రలు వహిస్తుంది. తల్లిగా, సోదరిగా, భార్యగా, ప్రేయసిగా ఎన్నో రూపాలలో బంధాలను పెంచనూ గలదు, వాటిని తుంచనూ గలదు. వివిధ కారణాలుగా పురుషుడికి మహిళపై ఆధారం. మహిళకు పురుషుడిపై ఆధారం. అదే జీవితాల్ని ముందుకుసాగేలా చేస్తుంది. ప్రపంచాన్ని సృష్టిస్తుంది.

English summary
You only have ...with your partner when you are sure about your relationship. A relationship is not a business and involves feelings and emotions.
 No girl ever has to make any compromise for continuing any relationship these days. If a relationship is based on such conditions then it is not a relationship, it is a compromise.
Story first published: Monday, May 14, 2012, 14:27 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more