ఈ తీర్పు ఒక వ్యక్తి తన భార్య తనతో రతిని నిరాకరించిందంటూ పెట్టుకున్న కేసుపై క్రిందికోర్టు అటువంటి నిరాకరణ విడాకులకు కారణమవుతుందని క్రిందికోర్టు తీర్పు ఇవ్వగా హైకోర్టు న్యాయమూర్తి దానిని ధృవపరుస్తూ తీర్పునిచ్చారు. ఈ భార్యాభర్తలు 1991 ఫిబ్రవరి 17వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరి కేసు తీర్పు క్రిందికోర్టులో ఫిబ్రవరి 2001లో వెలువడింది.
ఈ కేసులో భర్త తన భార్య తాను రతికి సిద్ధపడితే, ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదని, జీవచ్ఛవంలా పడివుంటోందని వివరిస్తూ కోర్టు కెళ్ళాడు. అయితే, ఆమె వైపునుండి ఏ రకమైన ప్రతి సవాలు లేకపోవడంతో కేసును అతనికి అనుకూలంగా క్రిందికోర్టు తీర్పునిచ్చింది. తన మొదటి రాత్రే ఆమె భర్తచే రతి చేయించుకోటానకి నిరాకరించిన ఆమె నిర్ణయాన్ని, తదుపరి రోజులలో కూడా తన భర్తతో చురుకుగా రతిలో పాల్గొనకపోవటాన్ని ఒక క్రూర చర్యగాను, వివాహ వ్యవస్ధకు అది ఒక పెద్ద దెబ్బగాను కోర్టు పరిగణలోనికి తీసుకుంది. న్యాయమూర్తి గంభీర్ ఈ కేసులో వివిధ సుప్రీం కోర్టు తీర్పులు కూడా పేర్కొన్నారు. రతిక్రీడ నిరాకరించటమనేది భార్య భర్తలలో ఎవరు చేసినప్పటికి అది క్రూర చర్యగా పేర్కొన్నారు.
బెడ్ రూమ్ సంక్షోభం ఎలా?
- తన భాగస్వామికి మొదటి రాత్రి రతి నిరాకరించటం క్రూర చర్య. అది విడాకులకు ఒక కారణం అవుతుంది.
- క్రింది కోర్టు తీర్పును సమర్ధిస్తూ న్యాయమూర్తి, కేసు వేసిన భర్తకు విడాకులు మంజూరు చేశారు.
- హైకోర్టు సెక్స్ నిరాకరించిన భార్య నిర్ణయాన్ని తీవ్ర క్రూర చర్యగా పరిగణించింది.
అయితే, హైకోర్టు ఎంత తరచుగా రతి చేయాలనే అంశం ఈ కేసులో పరిగణించలేదని అది భార్యా భర్తలు వారి మధ్య గల అనుబంధం, రతికి ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి వుంటుందని పేర్కొంది. రతిలో ఒక భాగస్వామి రతి అంటే చురుకుగా వుండవచ్చు, మరొక భాగస్వామికి అదే స్ధాయిలో కోరిక వుండకపోవచ్చు. లేదా అతను పూర్తిగా నపుంసకుడు కూడా అయివుండవచ్చని కోర్టు పేర్కొంది.
ఇటువంటి కేసులలో ఎవరు నిజం చెపుతున్నారనేది తెలుసుకోవటం కష్టమని, అయితే వారు తెలిపే సాక్ష్యాలవలన తీర్పు ఇవ్వబడుతుందని తెలిపింది. బెడ్ రూమ్ లో ఏం జరుగుతుందనేది జంటలకే తెలుస్తుంది. లేదా వారి కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. భార్యా భర్తలు సెక్స్ చేసుకున్నారా లేదా మరియు ఎన్ని సార్లు చేసుకున్నారు ? లేదా అసలు రతి చేయనే లేదా వంటివి పార్టీలు సమర్పించిన పత్రాల లేదా కాగితాలద్వారా నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది. అందులోనూ ఒక భాగస్వామి కనుక మరొక భాగస్వామి చేసిన ఆరోపణలను సవాలు చేయకపోతే కేసు వేసిన వారికి అనుకూలంగా తీర్పు చెప్పబడుతుందని కూడా హైకోర్టు తెలిపింది. కనుక భార్యా భర్తలలో ఏ ఒక్కరికి రతిక్రీడపట్ల ఆసక్తిలేక భాగస్వామిని నిరాకరిస్తే అది విడాకుల మంజూరుకు ఒక ఆధారం కాగలదనేది గ్రహించాలి.