ప్రాచీన కాలంలో రతిక్రీడలు అనేక సూత్రాలకు, సిద్ధాంతాలకు లోబడి సాగేవి. ఆనాడు కూడా కొంతమంది జంటలకు అధిక సంతానం వుండగా మరి కొందరికి మితంగాను, లేదా పూర్తిగా లేకుండాను కూడా వుండేవి. స్త్రీ గర్భం ధరించాలన్నా, గర్భ నిరోధం చేయాలన్నా భంగిమల ద్వారా వారు తమ సంతానోత్పత్తిని నియంత్రించేవారు. నిరోధ్, లేదా కాపర్ టి లేదా ఇతర గర్భ నిరోధక సాధనాలన్నీ నేటి రోజులలో వచ్చిన ఆధునిక నియంత్రణా పద్ధతులే కాగా, సంతానోత్పత్తి సమస్య లేనివారు తమ లైంగిక జీవిగతాలను మరింత మధురంగా ఏ రకమైనఅడ్డూ ఆపూ లేకుండా ఆనందించేస్తున్నారు. ఇవన్ని స్త్రీ పురుషుల మధ్య మాత్రమే. ఇక స్త్రీలకు స్త్రీలకు మధ్య, పురుషుడికి పురుషుడికి మధ్య కూడా సంపర్కాలు జరిగి ప్రకృతి విరుద్ధ లైంగిక చర్యలు కూడా నేడు చోటు చేసుకుంటున్నాయి.
జరిగే కామకేళిలో, సంతానోత్పత్తి జరగాలంటే, స్త్రీలోని అండమూ, పురుషుడిలోనీ వీర్యకణాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. సరైన సమయంలో ఈ రెండూ సంయోగం చెందితే సంతానోత్పత్తి జరిగి తీరుతుంది. సంతానోత్పత్తి జరుగరాదంటే స్త్రీలో అండం విడుదల లేకుండా వుండాలి. లేదా పురుషుడిలో తగినన్ని వీర్య కణాలు ఉత్పత్తి లేకుండా వుండాలి. ఎన్ని గర్భ నిరోధక సాధనాలు వచ్చినప్పటికి స్త్రీ పురుషులు తమలోపల జరిగే ఈ పరిణామాలను కూడా నియంత్రిస్తూ గర్భ నిరోధకతలు పాటిస్తూనే వున్నారు. మహిళ తన రుతుక్రమ సైకిల్ ఆధారంగా సంతానోత్పత్తిని నియంత్రిస్తోంది. పురుషుడు ఎంత కామకేళి జరిగినప్పటికి తన వీర్యం ఆమె గర్భాశయానికి చేరకుండా వివిధ రకాల చర్యలను ఆచరిస్తున్నాడు.
స్త్రీ పురుషుల కలయికలో గర్భం వస్తుందనుకుంటే బాహ్యంగా గర్భనిరోధక సాధనాలు తప్పక వాడాలి. లేదంటే వేరే విధాలుగా వీర్యకణాలు గర్భాశయాన్ని చేరకుండాచేయాలి. స్త్రీ పురుషుల కామకేళిలో సరికొత్త క్రీడ వేడినీటి రతి. వేడినీటిరతి పురుషుడి వీర్యం కణాలు ఆమె గర్భాశయం చేరకుండా, ఆమెకు గర్భం రాకుండా చేస్తుందని తాజాగా భావిస్తున్నారు. కాని అది సరికాదు. మీరు వేడినీటిరతిలో వాడేది, వేడి టబ్ అయినా సరే లేక వేడి షవర్ అయినా సరే, నీటివాతావరణం ఏదైనప్పటికి అది మీకు ప్రెగ్నెన్సీ రాకుండా చేయలేదు. అదే విధంగా సుఖ వ్యాధులు రాకుండాచేయలేదు. పురుషుడి వృషణాలు అతని శరీర ఉష్ణోగ్రత కంటే 5 డిగ్రీలు తక్కువగా వుంటాయి. కారణం అవి శరీరానికి తగలకుండా వేలాడుతూండటమే. ఇది చాలా ప్రధానమైంది. ఫలదీకరన ఫ్రక్రియకు అవసరమైన వీర్యం ఉత్పత్తి వేడి తట్టుకోలేదు. వేడి అధికంగా వుంటే, వీటిలోని కండరాలు రిలాక్స్ అవుతాయి. అపుడు వృషణాలు శరీరానికి దూరం జరుగుతాయి. దీనికి వ్యతిరేకంగా, చల్లటి ఉష్ణోగ్రతలో కండరాలు ముడుచుకుంటాయి. అపుడు మీ వృషణాలు చల్లదనానికి ముడుచుకొని శరీర ఉష్నోగ్రతకు దగ్గరవుతాయి. ఆ విధంగా వాటికవసరమైన ఉష్ణోగ్రత అవి నియంత్రించుకుంటాయి.
అయితే, ప్రక్రియ ఈ విధంగా వున్నప్పటికి వేడి నీరు టబ్ లో కూర్చున్నంత మాత్రాన మీ టెస్టికిల్స్ లోని కండరాలు రిలాక్స్ అయినప్పటికి అవి గర్భాన్ని నిరోధించేంత సమర్ధవంతంగా తమ వీర్యకణాల పటుత్వాన్ని కోల్పోవు. సాధారణంగా సంతాన సమస్యలున్న పురుషులకు సౌనా బాత్ లేదా హాట్ వాటర్ బాత్ వంటివి చేయవద్దని సూచిస్తారు. సాధారణ సంతానోత్పత్తి కలవారు కండోమ్ లేదా మరేదైనా గర్భ నిరోధక సాధనం వాడుకోవటం, ఏ పద్ధతి పాటించకపోవటం కన్నా మంచిది.