బ్లూ ఫిలింలు తరచుగా చూసి యువకులలో కోర్కెలు నశించిపోతున్నాయని, ఈ ఫిలింలలో అధికమైన ఆవేశం వుండటం, కాని వాస్తవంలో సాధారణ లైంగిక చర్యలు మాత్రమే వుండటంతో వీరు వాస్తవంలో మందకొడిగా తయారై సరైన సెక్స్ సామర్ధ్యాలను చూపలేకపోతున్నారని స్టడీ చెపుతోంది. బ్లూ ఫిలింలు నిరంతరం చూస్తూ వుంటే బ్రెయిన్ లోని ఆనంద కేంద్రం బాగా యాక్టివేట్ అయి డోపమైన్ హార్మోన్ బాగా రిలీజ్ అయిపోతుంది. మరల మీరు సాధారణ సెక్స్ చేసే సమయంలో బ్రెయిన్ నుండి అంత స్ధాయిలో డోపమైన్ రిలీజ్ అయితేకాని మీరు చేసే రతిలో తృప్తి పడలేరు. కాని సాధారణ సెక్స్ లో బ్లూ ఫిలింలలో చూపే హింసాత్మక సెక్స్ జరుగదు. కనుక బ్రెయిన్ లోని మీ ఆనంద కేంద్రం ఆ స్ధాయిలో డోపమైన్ రిలీజ్ చేయలేదు. మరో రకంగా చెప్పాలంటే, వ్యక్తి తీవ్ర స్ధాయి సెక్స్ చేస్తే గాని అంగం లేవలేని స్ధితికి వచ్చేస్తుంది.
ఈ అంశంగా 31 సంవత్సరాల వయసు కల ఒక ఐటి ప్రొఫెషనల్ అనుభవాలు వివరించాలంటే....‘‘నేను నా టీనేజ్ నుండి ఆన్ లైన్ బూతు చిత్రాలు చూడటానికి అమితంగా ఇష్టపడేవాడిని. అయితే, సరిగ్గా నాల్గు సంవత్సరాల కిందట నాకు వివాహమైంది. ఇపుడు నా పరిస్ధితి....నాకు నా భార్యతో లైంగిక చర్యలు చేయటం కంటే కూడా ఆన్ లైన్ లో బ్లూ ఫిలిం బొమ్మలు చూస్తూ కూర్చోవడమే నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. ఆమె దగ్గరకు వచ్చినప్పటికి, ఆన్ లైన్ చిత్రాలు చూసేంత ఆనందం ఆమెను దగ్గరకు తీయటంలో నాకు కలగటం లేదు ’’ . ఇపుడు ఇతని పరిస్ధితి, భార్యతో కలసి విషయ నిపుణుల చుట్టూ సలహా సంప్రదింపుల కొరకు తిరగటంగా వుంది. ఈ రకంగా చిన్న తనంనుండే, తప్పుదోవలు పట్టి, తమ వివాహ జీవితాలకు దూరం అయి కౌన్సెలింగ్ కావాలంటూ తిరిగే యువకులు ఎందరో వున్నారని మానసిక నిపుణులు చెపుతున్నారు.
ఈ రకమైన వ్యక్తులు దేశంలో నానాటికి పెరిగిపోతున్నారు. ప్రస్తుత సమాజం మీడియా, ఇంటర్నెట్, ఛానెళ్ళ కారణంగా, సెక్స్ రంగంలో పూర్తి స్ధాయికి చేరిపోయింది. టన్నుల కొద్ది సమాచారం లభించకూడనిదంతా అతి చిన్న వయసుల్లోనే లభిస్తోంది. వారి లైంగిక జీవితాలను అవసరమైన వయసులో బలి తీసుకుంటోంది. సెక్స్ పరంగీ నిర్వీర్యులైన వీరు భార్యలు వచ్చే సరికి తామేమీ చేయలేమంటూ చేతులు ఎత్తేస్తున్నారు. ఏమీ చేయలేని మగడిని విడిచి విడాకులు కోరేస్తున్నారు మహిళలు.
బూతు చిత్రాలు వ్యక్తి లైంగికతలను ఆనందం లేదా రొమాన్స్ పేరుతో హరించేస్తున్నాయి. బూతు ఫిలింలలో చూపేది సహజ సెక్స్ కాదు. ఇవన్నీ కంప్యూటర్లపై చిత్రీకరించే కదలికలు అన్న వాస్తవాలను యువత గ్రహించాలి. ఆ కదలికలు వాస్తవ జీవితంలో ఎంతో అసౌకర్యాన్ని, విఫలతలను కలిగిస్తాయి. ప్రత్యేకించి జంటలు తమ లైంగిక జీవితాలను మొదలు పెట్టిన కొత్తల్లో కనుక ఈ రకమైన భంగిమలకు ప్రయత్నిస్తే వారి మధ్య సంబంధాలు తీవ్ర స్ధాయి తెగతెంపులతో అంతం అవుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఎలా? రోగిని పూర్తిగా బూతు బొమ్మలకు దూరంగా వుంచండి, కౌన్సెలింగ్ చేయండి అవసరపడితే మందులు కూడా వైద్య సలహాపై తప్పక వాడండి అంటారు విషయ నిపుణులు.