మహిళల శారీరక శ్రమ, నిద్ర వంటివి పురుషులతో సమానంగా వుండవు కనుకే వారు త్వరగా నిద్రించేందుకు కూడా ప్రయత్నిస్తారని హార్వర్డ్ యూనివర్శిటీ ఒక కొత్త పరిశోధనలో వెల్లడించింది. జీవక్రియలో మహిళల శారీరక వ్యవస్ధల లయలు పురుషులతో పోలిస్తే ఆరు నిమిషాలు వేగంగా వుంటాయి. అందుకనే వారు పక్షులవలే తెల్లవారుఝామునే త్వరగా లేస్తారే కాని రాత్రంతా మెళకువగా వుండే గుడ్లగూబలవలే వుండేందుకు ఇష్టపడరు.
మహిళల శరీర గడియారంలో గల జీవక్రియ వలయాలు పురుషులతో పోలిస్తే తక్కువగా వుంటాయి. వీరికి పురుషులకు సగటు వ్యత్యాసం ఆరు నిమిషాలుగా వుంటుంది. నిద్రలేమి విషయానికి వస్తే, పురుషులతో పోలిస్తే అది 50 శాతం తరచుగా వుంటుంది. ఈ కారణంగానే ప్రత్యేకించి వేకువఝాము సమయంలో వారు లేచిన వెంటనే మరో మారు నిద్రపోలేరని పరిశోధకులు వెల్లడి చేసినట్లు డెయిలీ మెయిల్ పత్రిక ప్రచురించింది.
కాని మహిళలు ఉదయంవేళ త్వరగా నిద్ర లేచినప్పటికి మరల నిద్రలేకుండా కూడా సాయంత్రం వరకు తేలికగా గడపగలరు. కాని సాయంత్రం అయిందంటే చాలు వారిలో అలసట, నిద్ర ముంచుకురావటం వంటివి సహజంగా పురుషులకంటే కూడా ముందే వచ్చేస్తాయి. హార్వర్డ్ పరిశోధకులు తమ పరిశోధనలో షుమారు 157 మందిపై ఎనిమిది వారాలపాటు మహిళల నిద్ర, అది లేనపుడు వారిలో కలిగే శారీరక స్పందనలు వంటివి తీవ్రంగా స్టడీ చేశారు.
బయటి ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే పూర్తిగా దానికి వ్యతిరేకంగా మహిళలు తమ శారీరక గడియారాల స్పందనలకు లొంగిపోతారని ఇది సహజంగా వారిలో జరిగే ప్రక్రియ అని తేల్చారు. ఆమెలో జరిగే ఈ శారీరక మార్పులు రాత్రివేళ పురుషుడు పడకలో అన్నిటికి సిద్ధంగా వున్నప్పటికి ఆమెను గుర్రు పెట్టేలా చేస్తాయి.