•  

పక్కదార్లు పడుతున్న లైంగిక విలువలు!

 Forgetting Pleasures of Marriage Values!
 
భార్యా భర్తల బెడ్ రూమ్ లో చోటుచేసుకున్న నిశ్శబ్దం, కామపరంగా వారిని బయట పక్కదోవలు పట్టిస్తోంది. స్త్రీలు, పురుషులు వివాహ బంధాన్ని పక్కన పెట్టి ఇతర ప్రదేశాలలో దొరికే ఆనందానికి లొంగిపోతున్నారు. పురుషులు బహిర్గతంగానే ఎక్కడో అక్కడ దొరికిన చోట ఒక రాత్రి గడిపేస్తున్నారు. అది భార్యకు తెలిసేదే. అయితే ఇక స్త్రీలు మరింత తెలివిగా, నేర్పుగా ఎవరికి తెలియకుండా క్రమం తప్పని అలవాట్లకు దాసోహమంటున్నారు. ఫలితం.....అటు భర్త, ఇటు భార్య ఇద్దరూ కూడా వివాహబంధంలోని సెక్స్ కు దూరమవుతున్నారు. వివాహేతర సంబంధాలు అధికమవుతున్నాయి. ఉద్యోగాల్లోనే తమ కామవాంఛలను తీర్చేసుకుంటున్నారు. ఇంటికొచ్చేటప్పటికి బయట పొందిన అనుభవాలను ఇంటిలో వాటికి పోల్చుకోటమే.

వీటికి తోడు తాజాగా వచ్చిన సెల్ ఫోన్లు భార్యా భర్తల లైంగిక చర్యలకు అడ్డంకిగా వుంటున్నాయి. పడకగది సమయంలో మంచం ఊగే సమయంలో....సరిగ్గా కామకేళి మధ్యలో బ్లాక్ బెర్రీ బీప్ సౌండ్ తో భర్త లేచిపోవడంగా వుందని ఒక భార్య ఇబ్బంది. సెల్ ఫోన్ కాకపోతే, ఇక ఇడియట్ బాక్స్ ఇబ్బంది....ప్రతిరాత్రి టివిలో ఏదో ఒక మ్యాచ్....దాని స్కోరంటూ, ఆట గెలుపంటూ పురుషుడు పడకగది చేరేదే లేదు. చేరినప్పటికి మధ్య మధ్యలో టివి చూడాల్సిందే. వారి మైండులో వుండేది మ్యాచ్ తప్పించి పక్కలోవుండే భార్య కాదని కూడా భార్యలు వాపోతున్నారు. అదే విధంగా టివియే దైవంగా భావించి చూసే భార్యలు తమ జంట అందులోని ఇమ్రాన్ ఖాన్ , అవంతికల జంటగా వుండాలని కూడా కోరతారు. వారు గడిపే జీవితంలోని లోటుపాట్లు వీరికి తెలియవు.

నగర జీవనంలో మాయమైన శృంగార జీవితం
పురుషులు తమ భార్యలను స్లీపింగ్ పిల్స్ గా వాడేస్తున్నారు. తరచుగా పురుషుడు సెక్స్ లో భార్య సగం లో వుండగానే తాను క్లైమాక్స్ చేరిపోడం ఆమెకు నిరాశ కలిగేటప్పటికి నిద్రలో గుర్రు పెడుతూండటం జరుగుతోందని డా. కొఠారి చెపుతారు. భారతీయులలో అధిక జనాభా సెక్స్ మొదలు పెట్టిన వెంటనే క్లయిమాక్స్ చేరిపోతారని, తాము చేసిన సర్వేలో 46 శాతం మాత్రమే వాస్తవ రతిక్రీడను తృప్తిగా ఆచరిస్తున్నారని తేలిందని డా. కేవన్ వీలే చెపుతారు.

సెక్స్ లో క్లయిమాక్స్ లకంటే కూడా రిలాక్సేషన్ ప్రధానమని దానికిగాను కొంత సమయం పడకలో భాగస్వామితో అటు ఇటు పొర్లటం, ఫోర్ ప్లే చేయటం, ముద్దులు పెట్టటం వంటివి చేయాలని, సెక్స్ సమయంలో ఏ ఆటంకం వుండరాదని, సమస్యలన్ని బెడ్ రూమ్ బయట వదలాలని ఆధునిక సెక్సాలజిస్టులు చెపుతున్నారు.

తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో సెక్స్ చేయటంలో, 27 శాతం నెలకో రెండు నెలలకో ఒకసారి, 18 శాతం అసలు ఎపుడూ లేదు. 57 శాతం పురుషులు పైన పడుకొని చేయటం బాగుంటుందని, 62 శాతం రాత్రిపూట బెడ్ రూమ్ లలో బాగుంటుందని తెలిపినట్లు తేలింది.

English summary

 During the counselling sessions that follow, I invariably find that one of them is suffering from depression or anxiety, which could stem from loneliness and the empty nest syndrome to a lack of selfworth or financial losses. "I see at least one case every day where the man or woman confesses that they've lost all interest in Romance, or complain that they hardly have it.
Story first published: Saturday, May 12, 2012, 15:19 [IST]

Get Notifications from Telugu Indiansutras