•  

వివాహేతర సంబంధం విలువైనదేనా?

Extra-Marital Affair
 
వివాహేతర సంబంధాలు జీవితంలో అధిక మజా కావాలనుకునేవారికి ఆనందం ఇస్తాయి. వివాహం ఎంత ప్రాచీనమైందో, జీవిత భాగస్వామి పట్ల ద్రోహం చేయటం కూడా అంతే ప్రాచీనమైంది. నానాటికి పెరిగిపోతున్నద్రోహ జీవిత భాగస్వాములు తమ వివాహానికి ఎంత నష్టం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నారు. ఆసక్తి కరమైన అంశం ఏమంటే... ఒక వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో 41 శాతంమంది భాగస్వాములు లైంగిక జీవనంలో వేరేవారితో సంబంధం కలిగి వుండటం లేదా తన భాగస్వామిని మోసం చేయటం అతి సాధారణంగా పేర్కొంటున్నారట.

చాలామంది... అసలు ఒక సారి మరోకరకిని రుచి చూస్తే ఎలా వుంటుందనేందుకు కూడా సంబంధం ఏర్పరచుకుంటున్నారట. తమ వివాహ జీవితంలో భాధ్యతలన్ని బాగా నిర్వహిస్తున్నపుడు ఒకసారి బయటి సంబంధం రుచి చూస్తే ఏమిటంటున్నారు వీరు. పార్టీల్లో మజాలు, పీకల్లోతుకు తాగేయటం, పక్కలో పడుకునేవారెవరో కూడా పట్టించుకోకపోవడం. అదేంటమ్మడూ ...అంటే, నేను నా భర్తను ఇప్పటికి మనసారా ప్రేమిస్తూనే వున్నా...ఏదో బోర్ కొట్టేసి జస్ట్ ఫర్ ఛేంజ్ అక్కడ సెటప్ చేశా....? అంటున్నారట.

అయితే, ఈ అంశంలో మానసిక నిపుణుల అభిప్రాయం మేరకు, పురుషులు మొదటినుండి బహు భార్యలు కలవారే. తమ వివాహ జీవితంలో ఆనందం లేకపోవటం వలనో, వేరే ఇతర కారణాలవలనో ఇంట్లో రామయ్య...వీధిలో కిష్టయ్య టైప్ లో మరో మహిళతో సంబంధాలు కొనసాగించేస్తూంటారు. ప్రత్యేకించి పెద్దలు చేసిన వివాహాలలోని వారు, ఈ రకమైన మరో ఎంపికకు సిద్ధ పడతారు. ఆధునిక టివి లు, పురుషులు, స్త్రీల మధ్య సన్నిహిత్వం పెరిగిపోవటం, వంటివి, ఏడేళ్ళు గడిచే సరికి బోర్ కొట్టేయటం మరో భాగస్వామితో సంబంధం పెట్టుకోవడం వంటివి జరిగిపోతున్నాయి.

కొంతమంది వివాహ జీవితం సంతృప్తిగా లేక సంబంధం ఏర్పరచుకుంటారు. మానసికంగా ఆనందపడతారు. తమ భార్యలతో అసలు ఏ రకమైనఫిర్యాదు లేదని చెపుతారు. వారికి భర్త ఏమేమి ఇవ్వాలో అనన్ని ఇస్తున్నామని ప్రతివారు అందరిని వివాహం చేసుకోలేరు కనుక మరో మహిళను సెటప్ గా పెట్టుకొని ఆనందిస్తున్నామని వీరు భావిస్తారు. మరి కొందరు మహిళలు భర్త అంటే ప్రేమే కాని అతనికి మగతనం తక్కువైన కారణాన మరో మగాడ్ని వుంచుకోవాల్సి వస్తోందంటారు.

మరికొందరు, తెలియని వారితో సెక్స్ మహా ఘాటుగా చేసేయవచ్చు. అందుకనే మరొకరు. అంటారు. జీవితంలో వెరైటీ మహా ఆనందం కలిగిస్తుంది. వివాహ జీవితాన్ని పాడు చేసుకోకుండా వెరైటీ రతి కొరకు సెట్ అప్ తో చెట్టాపట్టాలు వేసే వారు కూడా లేకపోలేదు. మరి నేడు తాజాగా ఆచరించబడుతున్న ఓపెన్ మ్యారేజీ వ్యవస్ధలో పరిస్ధితులు వేడెక్కి చేతులు జారకముందే వాటిని వదిలేయటం కూడా చేయాలంటున్నారు మరి కొందరు ప్రబుద్ధులు. చివరగా....వివాహేతర సంబంధం, మనసుకు ఆనందం కలిగించేదైనా లేక శరీర సుఖం కలిగించేదైనప్పటికి, చివరకు ప్రతి వారూ కుటుంబాలకే తమ ఎంపిక చూపుతున్నారు.

English summary
In 'open marriages', individuals have to learn the art of backing off before things become too hot to handle. Ultimately, whether it's an affair of the mind or for pleasure, it's the families they want to go home to! "I love my husband deeply and can't dream of any other man in my life. Unfortunately, he has a low....
Story first published: Tuesday, May 1, 2012, 12:29 [IST]

Get Notifications from Telugu Indiansutras