అయితే, కాళ్ళపై నిలబడి లేదా బెడ్ పై మోకాళ్ళపై నిలబడి చెమట కారుస్తూ ఎంతో శ్రమ చేసిన మీదట కొంతమేరకు అలసిపోవడం అసాధారణమేమీ కాదు. కాని నూటికి మూడు వంతులమంది స్త్రీలు ఎంత తృప్తికరంగా రతి చేసినప్పటికి తాము మనోవ్యదధకు గురవుతున్నామని వాపోతున్నారంటూ ఒక కొత్త ఆస్ట్రేలియన్ స్టడీ చెపుతోంది. ఈ అంశం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెక్సువల్ హెల్త్ లో ప్రచురించింది. ఎంత మంచి రతి చేసినా, చేసేటపుడు ఎంత ఆనందం కలిగినా అంతా యిపోయిన తర్వాత ఏర్పడే మానసిక విచారం రతి అనంతర మానసిక విచారంగా పిలువబడుతుంది. ఈపరిస్ధితి షుమారుగా 10 శాతం మహిళలలో ఎల్లపుడూ వుంటుందని రీసెర్చర్లు కననుగొన్నారు.
రతిఅనంతర మానసిక విచారం మీరు పొందుతున్నారా? లక్షణాలు ఎలావుంటాయంటే, విచారం, ఆందోళన, పశ్చాత్తాపం, అలసట, చికాకు వంటివిగా వుంటాయి. ఈవ్యతిరేక భావనలు చాలామంది మహిళలకు, పురుషులకు కూడా వస్తూంటాయి. వీరు స్వయం మైధునం చేసుకన్నప్పటికి వస్తాయని సెంటర్ ఫర్ సెక్సువల్ హెల్త్ ప్రమోషన్ అసోసియేట్ డైరెక్టర్ డెబీ హెర్బెనిక్ తెలిపారు. ఈ పరిస్ధితి వైవాహిత జంటలకే కాక, విద్య లో వున్న విద్యార్ధులకు సైతం కలుగుతుందట. వయసుపైపడిన పురుషులు, స్త్రీలలో కూడా వుంటుంది.
కొంతమంది వ్యక్తులకు లైంగిక సంబంధంగా మిశ్రమ భావనలుంటాయి. అవి వారి పెంపకం, మతం లేదా ఇతర కారణాలుగా ఏర్పడతాయి. సెక్స్ అంటే మరింత ఇష్టపడే వారికి ఈ ఆలోచనలు మరింత అధికంగా వుంటాయని వీరు తెలుపుతున్నారు. రతి తర్వాత విచారం ఎందుకు కలుగుతుంది?
స్కలనం తర్వాత హార్మోన్లు స్ధాయి మారుతుంది. అవి కొన్నిమార్లు తలనొప్పి కూడా కలిగిస్తాయి. చేసే రతిక్రీడ, మీ సంబందంలో లేదా బెడ్ రూమ్ బయటి జీవితంలో కొన్ని అంశాలను ప్రభావిస్తోంది.
సెక్స్ తర్వాత మీరు విచారంగా వుంటే, దానికి తగిన కారణాలు శోధించండి. మీ పార్టనర్ తో ఇబ్బంది పడ్డారా? శారీరక సమస్యలా, మీరే సరిగా చేయలేకపోయారా?లేక మీ జీవితంలో ఇతర అంశాలు సరిగా లేక విచారంగా వున్నారా? రతి అనంతర విచారం అనే ఈ సమస్య తరచుగా కొనసాగుతుంటే తక్షణం వైద్యులను లేదా కౌన్సెలర్లను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలంటున్నారు రీసెర్చర్లు.