అసలు ఈ కన్నెపొర అంటే ఏమిటి? ఎలా వుంటుంది? కన్నెపొర లేదా హైమెన్ అనేది పలుచని కణజాలం. ఇది యోనిలోకి అంగప్రవేశాన్ని నిరోధిస్తుంది. మొదటి రతి అనుభవంలో ఈ పొర చిట్లిపోతుంది. స్వయంమైధునం చేసుకున్నాఇది చినిగిపోతుంది. ఈ కణజాలం పొర చినిగితే కొద్దిపాటి నొప్పితో, రక్తస్రావం అవుతుంది. అది సాధారణంగా వుండేదే. రక్తస్రావం అంటే కన్యత్వం పోయినట్లే. అయితే, ప్రతి మహిళకు రక్తస్రావం అవ్వాలని లేదు.
రతిలో ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. కన్నెపొర బిగువుగా వుంటే, పురుషులకు అంగప్రవేశం ఒక సవాలుగా వుంటుంది. అయితే, కన్నెపొర మీరు క్రీడాకారిణి లేదా బాగా వ్యాయామాలు చేసేవారు అయినట్లయితే అది బాగా సాగిపోయి కూడా వుంటుంది. కొన్ని వ్యాయామాలు చేస్తే కన్నెపొర సమంగా వుండదు. అవేమిటో పరిశీలించండి.
- స్ట్రెచింగ్ లు చేయటం
- కటి ప్రదేశానికి ఒత్తిడి కలిగే స్విమ్మింగ్, వంటి వ్యాయామాలు చేయటం
- సైకిలింగ్ చేయటం
- గుర్రపు స్వారీ
- జిమ్ లో చేసే వ్యాయామాలు
ఈ వ్యాయామాల ఫలితంగా కన్నెపొర చిరిగినప్పటికి, మీ కన్నెత్వం పోయినట్లుకాదు. కన్నెపొర లేనంతమాత్రాన మహిళ కన్య కాదు అనరాదు. మహిళ చేసే ఈ వ్యాయామాలు ఆమె కటి కండరాలను సాగదీసి కన్నెపొర పొజిషన్ తప్పేలా చేస్తాయి. అందుకనే క్రీడాకారిణులు తమ వర్జినిటీ కోల్పోయినప్పటికి రక్తస్రావం అవదు.