•  

మహిళ కోరే మగాడు... మందుకొట్టినా మంచోడే!

5 Men every Woman Needs!
 

మహిళ తన పురుషుడి ఎంపికలో ఎంతో ఆసక్తి కనపరుస్తుంది. ఆమె కోరిన మగాడు కనపడితే చాలు తన సర్వస్వం అర్పిస్తుంది. సాధారణంగా మహిళలు తమకు ఎలాంటి పురుషుడు కావాలని కోరుకుంటారు. మహిళల మనసులోని భావాలు ఎలా వుంటాయి? ఒక మహిళ తాను కోరే అన్ని గుణాలను ఒకే పురుషుడిలో చూసుకోగలదా? మహిళ తనకు ఎంత తెలిసినప్పటికి తన పురుష స్నేహితులపై ప్రతి అంశంలోను ఆధారపడుతూనే వుంటుంది. అది నిజాయతీ అయిన సలహా కావచ్చు. షాపింగ్ చిట్కాలు కావచ్చు లేదా హాని కలిగించే రొమాన్స్ కావచ్చు.... అటువంటి పురుషుడు దొరికితే, మహిళ తన జీవితమంతా ఇక నాన్ స్టాప్ .......చదవండి ఇక....

మిస్టర్ సంతోష్
ఈ రకం పురుషులు మంచి చవటలు. ఆమె స్నేహితుడుగా ఎపుడూ ఆమె సంతోషంగా వుండటమే ఆమెకు కావాలి. అతనికి ఎన్ని సమస్యలున్నా ఆమె కొరకే పడి చస్తాడు. అతను మీతో వుంటే చాలు మీరు ఎంతో ఆనందంగా వుంటారు. అయితే వీరు ఇరవై నాల్గు గంటలూ అదే రంధిలో వుండరు. కనుక ఒక సెలవురోజైనా సరే వీరితో ఆనందంగా గడిపేయటం మహిళకు ఎంతో ఇష్టం.

మిస్టర్ నిజాయతీ
మహిళలు వారిలో వారు ఎంత నిజాయతీగా వున్నప్పటికి చివరకు పోట్లాడుకుంటారు. కాని పురుషులు విషయాలను పోట్లాటలవరకు తెచ్చుకోరు. అయితే, మహిళలు మాత్రం చివరి అంశం లేదా పోరాటం వరకు నిజాయతీగా తమతో వుండి పోరాడే వ్యక్తులను కోరతారు.

మిస్టర్ హేళన
డల్ గా వుంటూ ఎగతాళి చేసినా ఏమీ అనుకోని పురుషులంటే మహిళ ఇష్టపడుతుంది. ఇటువంటివారు మహిళలకు ఆనందమే. సమాజంలో వీరికి సరైన గౌరవం లేకున్నా అతనిలోగల డల్ నెస్ లేదా ఏకాగ్రతలకు ఆమె ఇష్టపడుతుంది. అతనికి ఏమీ తెలియకపోయినా సరే తన అవసరం గడిస్తే చాలనుకుంటారు. అతను కనుక బాగా విద్య కలిగి సమాజంలో గౌరవం ఉన్నవాడైతే ఆమెకు మరింత ఆనందం.

మిస్టర్ హృదయ ప్రేమి
ఈ రకం వ్యక్తులు చాలామంది స్నేహితులను కలిగివుంటారు. లింగభేధం పక్కన పెట్టి మంచి సంబంధాలను ఎవరితోనైనా సరే నిర్వహిస్తారు. మహిళలకు వీరు తప్పక కావాలి. అందునా, ఆమె భగ్నప్రేమికురాలైతే, ఇటువంటి వ్యక్తిని తప్పక కోరుతుంది.

మిస్టర్ సాహసి
ఈ తరహా వ్యక్తులతో ఆమెకు ఎప్పటికి బోర్ కొట్టదు. అతను ఆమెను ఎన్నో ఎత్తులకు తీసుకు వెళతాడు. ఎన్నో అవకాశాలు కల్పిస్తాడు. ఎంతో ధైర్యం చెపుతూంటాడు. అయితే, ఈ రకం వ్యక్తులు లేదా పురుషులను ఆకాశం నుండి మరోమారు భూమి మీదకు తీసుకురావటం మహిళ తరం కాదు. అయినప్పటికి మహిళ అతనంటే పడి చస్తుంది.

English summary
With him, you'll never ever get bored. This guy will push you out of your comfort zone and show you there's always opportunity for wild escapes. But the flip side to such free spirited guys is that you can never tie this guy down, as he needs lots of space.
Story first published: Thursday, May 3, 2012, 12:48 [IST]

Get Notifications from Telugu Indiansutras