ఈ అంశంగా బోయిసే స్టేట్ యూనివర్శిటీ రీసెర్చర్లు 484 మంది వివిధ రకాలుగా సెక్స్ ఆకర్షణలుకల స్త్రీలను పరీక్షించింది. వారిలో 45 శాతం మంది అసలు మహిళను ముద్దుపెట్టుకోటానికి మక్కువ చూపగా మరో 50 శాతంమంది మరో మహిళతో సెక్స్ చేయాలని వాంఛించినట్లుగాకూడా తెలిపారు. వీరి మధ్య సెక్స్ సంబంధాలు ఎలా వున్నప్పటికి, ఏదో ఒక సమయంలో లైంగిక జీవనం గురించి మాట్లాడుకుంటూ వుంటారని, సాధారణ మహిళలకు మరో మహిళ అంటే స్నేహపూరిత ప్రేమకంటే కూడా కొంచెం అధికంగానే వుంటుందని గంటల తరబడి మాట్లాడుకోవడం, సినిమాలు చూడటంగా కూడా వుంటుందని తెలిపారు.
పురుషులలోని స్వలింగ సంపర్కాలకంటే కూడా మహిళలలోని స్వలింగసంపర్కాలు తీవ్రమైన స్ధాయిలో జరుగుతాయని, కొన్నిమార్లు లైంగికపర చర్యలకారణంగా భాగస్వామి తీవ్రగాయాలకుగురవటం కూడా జరుగుతుందని, ఈ రకమైన తీవ్రత పురుషుడు, స్త్రీ మధ్య జరిగతే లైంగిక చర్యలలో కూడా వుండకపోవచ్చునని పరిశోధకులు భావించారు. మహిళల మధ్య గల స్నేహం రొమాంటిక్ సంబంధంతో వేరు చేయలేము. మహిళలు భావోద్రేకాలతో ఒకరికొకరు ముడపడి వుంటారు. అది వారిలో సన్నిమిత్వం, రొమాంటిక్ భావనలు కలిగిస్తుంది అని ప్రొఫెసర్ మోర్గాన్ డెయిలీమెయిల్ లో తెలిపారు. ఇదే రకంగా ఊతా యూనివర్శిటీ సైకాలజిస్టు పదిహేను సంవత్సరాలపాటు ఇతర మహిళలను ఆకర్షిస్తున్న మహిళలను పరిశీలించాడు.
అతను సేకరించిన సమాచారం అసలు మహిళలలో లైంగికత జీవితంలో ఎలా పెరుగుతూ వస్తుందనేది పరిశీలించాడు. ఇంటర్వ్యూ సమయంలో, అతను ప్రతి మహిళను స్వలైంగిక, పురుష సంపర్క, స్త్రీమరియు పురుష సంపర్క మహిళలుగా విభజించి వారి ప్రేమ జీవితాన్ని వర్ణించమని కోరాడు. అతని ఫలితాలు పరిశీలిస్తే, ప్రతి మహిళా కూడా అనేక సార్లు తన వర్గీకరణ మార్చుకుంది. అయితే, వయసు పైబడే సరికి అసలు ఏ రకమైన ఆకర్షణా కూడా లేదని తెలిపారు. ఇక తాము ఏ కేటగిరీకి కూడా చెందమని వెలిబుచ్చారు.
లైంగికత అనేది వయసును బట్టి వుంటుందని భావిస్తున్నామని, చివరకు వయసు పైబడే సరికి పరిపక్వతలో తాము ఏ కేటగిరీకి చెందిన వారు కాదని మహిళలు తెలిపారట. అయితే తమ పరిశోధనలు ఈ అంశంలో మరింత ముందుకు కొనసాగుతున్నాయని కూడా రీసెర్చర్లు తెలిపారు.