సాధారణంగా పురుషులు మోహంలో పడితే....మహిళలను వారి దుస్తులు లేకుండా ఊహించుకుంటారు. ఆనందిస్తారు. మరి ఆ పరిస్ధితి మహిళలకు మానభంగంతో సమానమే. మరి ఈ నయన మైధునానికి ఏమీ చేయలేని మహిళ నిస్సహాయంతో ఉండిపోతుంది. అందునా నేటి మహిళలు తమ దుస్తుల పట్ల మరింత అశ్రధ్ధ చూపుతుండటంతో పురుషుడి ఆనందం ఇక వర్ణనాతీతంగా వుంది. ఊహలలోనే కాక, వాస్తవంలో కూడా మానభంగాలు జరిగిపోతున్నాయి.
స్తనాలు దేనికి చిహ్నం ....మహిళాతనానికి అవి చిహ్నాలు. ఫలదీకరణకు, సంతానోత్పత్తికి తాను నిదర్శనమని మహిళ చాటే లక్షణాలు. స్తనాలు ఏ సైజువైనప్పటికి సైజుతో నిమిత్తం లేకుండా పురుషులకు ఆనందం ఇవ్వడం, బిడ్డలకు పాలు ఇవ్వటం, మహిళను శారీరకంగా ఒక మహిళ అని చూపటం చేస్తాయి. యుక్త వయసు వచ్చిందంటే చాలు మహిళ క్రమేణా ఈ ఆస్తులను పెంచుకుంటూ వస్తుంది. బిడ్డలను పెంచే సమయంలో వాటితో ఎంతో అవస్థలుపడుతుంది. మహిళ శరీరంలోవచ్చే సహజపరిణామాలలో స్తనాలు కూడా ప్రధానమైనవే.
ఇప్పటికి కొన్ని పాశ్చాత్య దేశాలలో స్తనాల ప్రదర్శన ఒక దురాచారం. అది ఒక సిగ్గుమాలిన చర్యగా భావిస్తారు. అశ్లీల చిత్రాలలోనే నగ్నమైన స్తనాలుండాలని భావిస్తారు. బూతు పుస్తకాల పరిశ్రమ, చిత్ర పరిశ్రమలు ఆడదాని ఆస్తులను పురుషులకు చూపుకుంటూ కోట్లాది సొమ్ములను గడిస్తున్నాయి. స్తనాలు చూస్తే చాలు కవ్వింపు పొందే పురుషుల కారణంగా అవి అన్ని సమయాలలోను కప్పి వుంచబడుతున్నాయి. మరి వాటిలోని నగ్నత్వాన్ని చూసేటందుకుగాను పురుషుడు, పుస్తకాలను వెబ్ సైట్లను ఆశ్రయిస్తున్నాడు.
మరోవైపు కొన్ని యూరోపియన్ దేశాలలో మహిళలు అతి సాధారణంగా బీచ్ వంటి ప్రదేశాలలో స్తనాలకు ఏ రకమైన దుస్తులు లేకుండానే నగ్నంగా తిరిగేస్తున్నారు. అయినప్పటికి అక్కడి పురుషులు ఏ రకమైన లైంగిక భావనలు లేకుండా స్వేచ్ఛగా వారితో సంచరించేస్తున్నారు. స్తనాలను అక్కడి పురుషులు ప్రత్యేకించి చూడరు. వాటిని ఒక దురాచారంగా భావించరు. మరికొన్ని వెనుకబడ్డ ప్రాంతాల అనాగరిక తెగలలో సైతం పురుషులు తమ మహిళల స్తనాలకు ఎట్టి ప్రాధాన్యతను ఇవ్వరు. సమస్య ఏమంటే, వాటిని నాగరికులు సాంప్రదాయాలపేరుతో కనుమరుగు చేయటంతోనే వాటికి పురుషులు ప్రాధాన్యతలనివ్వడం జరుగుతోంది.