వారాంతపు సెలవులకు వేయాల్సిన ప్రణాళికలు ఎలా వుండాలి?
ప్లాన్ వేయండి - ముందుగా అసలు మీరు ఎక్కడ గడపాలనేది నిర్ణయించుకోండి. ఇద్దరికి ఇష్టమైన ప్రదేశాలు ఎంచుకోండి. అతను కనుక బీచ్ కోరితే, ఒక బీచ్ రిసార్టుకు వెళ్ళండి. ముందుగా ప్లాన్ చేస్తే అది మీకు ఆనందం ఇస్తుంది.
ఏర్పాటు - మీరు వెళ్ళే ప్రదేశం నిర్ణయమైతే, అక్కడి రూమ్ లు, ఇతర వసతి అవసరాలకు ఏర్పా్లు చేయండి. మీ పురుషుడిని సర్ ఫ్రైజ్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే ఏర్పాట్లు సెలవుల ఏర్పాట్లుగానే వుండాలి. వేసే చిన్న ట్రిప్ కు మీ బడ్జెట్ అధికం కాకుండా చూడండి.
సిద్ధం అవండి - వారాంతపు సెలవులను మరచిపోకుండా వుండటానికి, సెక్సీగా తయారవండి. జననాంగభాగాలలో వెంట్రుకలు తొలగించేయండి. శరీరంలోని అనవసర వెంట్రుకలను తొలగించి ఆకర్షణీయం గా వుండండి. ఇలా చేస్తే...మీ పురుషుడు కైపెక్కిపోతాడు. కాళ్ళకు, శరీరం మొత్తానికి వేక్సింగ్ చేయండి. అవసరమనుకుంటే మసాజ్ చేయించుకోండి. ఇది మరింత కోరిక కలిగిస్తుంది.
సర్ ప్రైజ్ - మీరు మీ ప్రణాళిక, ఏర్పాట్లతో రెడీగా వుంటే, ఇక మీ పురుషుడిని ఎలా ఆశ్చర్యపరచాలనేది ఆలోచించండి. మిమ్మల్ని అతను మెచ్చుకోవడమేకాదు మరోమారు మీరంటే లవ్ లో పడతాడు. ఏదేని సెక్సీగా కొత్తతరహాగా వుండే లా చేయండి. రాత్రులు రొమాంటిక్ గా సాగటానికి సెక్సీ లోదుస్తులు కొన్ని తీసుకు వెళ్ళండి.
ముందస్తు జాగ్రత్తలు పాటించండి - మీరు వేసివి వారాంతపు ఆనందానికి వెళుతున్నారు. అయితే మీరు కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. మీరు కనుక ప్రెగ్నెంట్ అవ్వాలని లేకుంటే, కొన్ని కండోమ్ లు, డాక్టర్ తెలిపిన గర్భ నిరోధక మాత్రలు తప్పక తీసుకు వెళ్ళండి. ఇది మీ కామకేళికి ఏ మాత్రం అడ్డుకాదు.
ఇక మీరు నిజంగా ఏదేని వారాంతపు సెలవు ఆనందించేందుకు వెళుతూంటే మీ ఏర్పాట్లు ఎలా ? అనేది మాకు వ్రాయండి.