ఇక వీరి అలవాట్లు పరిశీలిస్తే, పొగతాగే అలవాటుంటే, శరీర రక్తం త్వరగా వేడెక్కదు, ప్రవహించదు. కనుక అది మిమ్మల్ని ఆ పని సమయంలో మందంగా తయారు చేస్తుంది. పొగతాగే పురుషులకు అంగస్తంభన సరిగా వుండదనికూడా హెచ్చరిక చేయవచ్చు. ఇక మహిళలు పొగతాగే వారైతే రతిలో వారికి స్కలనం ఎపుడైందో కూడా తెలియని స్ధితి వచ్చేస్తుంది. ఈ రకమైన అడ్డంకులు లేకుండా పడకగది చర్యలు ఆనందంగా జరగాలంటే నిబంధనలు లేని రతిని ఆనందించాలనుకుంటే కాంట్రాక్టుల వంటి ఒప్పందాలకు దూరంగా వుండాలి.
ఒక పక్క పెళ్ళిళ్ళు అయే నాటికి వాంఛలు తగ్గి శృంగారం శూన్యమై జంటలు విడాకులు తీసుకుంటున్నారు. మరి ఈ సమయంలో పెళ్ళికి ముందే జంటలు లైంగిక ఒప్పందాలకు లైసెన్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది? అది సెక్స్ నిపుణులకే ఒక సవాలుగా మారింది. కాంట్రాక్టు ఒప్పందం, కలసివుండే ఏర్పాటు, వివాహం ఇవి శృంగార జీవితంలోని మెట్లు. కాంట్రాక్టు జంటలు ఏం చేస్తారు. రతిక్రీడల నిబంధనలు కాగితంపై వ్రాసుకుంటారు. వాటికి ఎంతవరకు కట్టుబడి వుంటారనేది అనుమానమే. కాంట్రాక్టు అయిన తర్వాత వివాహానికి దారితీస్తుందా? అనేది సందేహాస్పదమే.
జంటలకు నేడు కాంట్రాక్టు జీవితాలు సౌకర్యమే. కాని వాటిని చట్టబద్ధం చేసుకోవటానికి కూడా వారు ఇష్టపడటం లేదు. కాంట్రాక్ట్ సంబంధంలో ఎంతో సంకుచిత్వం. అందులో విడాకులు తీసుకుంటే ఆస్తులు, భాగస్వామి మద్దతు, పుట్టే పిల్లలపై ఆధిపత్యం వంటివేవీ కనపడటంలేదు. అసలు వివాహం అనేది వ్యాపారమా? కాంట్రాక్టులో వారి రతి కోరికలు వ్రాసుకుని ఎన్ని జంటలు వాటిని ఆచరిస్తున్నారు? రతికి నిబంధనలా? అదెలా? వారానికి ఇన్ని సార్లనా? లేక ఇంతసేపు అనా,?
ఈ రకంగా చేసుకునే ఒప్పందాలు వివాహాన్ని వ్యాపారం చేస్తున్నాయి. పెళ్ళి అనే మంచి సంబంధంలోని లోని అనుబంధం, సున్నితత్వం, పవిత్రతలను పాడు చేస్తున్నాయి. జంటల కలయిక ఎలాకావాలంటే, ప్రేమగా... అలా...అనే రకంగా వుండాలిగాని నిబంధనలు వ్రాసుకుంటే అందులోని ఆచరణ కష్టమే అంటారు మానసిక వేత్తలు. సంబంధం నిర్వహణల కొరకు జంటలు తీవ్రంగా కృషి చేయాలి. సమస్యల పరిష్కారంకై నిపుణుల సహాయం అవసరాన్ని బట్టి తీసుకోవాలి అని కూడా ప్రస్తుతం ఒప్పందాలలో వ్రాసుకుంటున్నారు. సెక్స్ అనేది ఒక మంచి సంబంధంగాకంటే, ఒక ప్రొడక్టుగా పరిగణించబడుతోంది.
అసలు కాంట్రాక్టు అవసరం ఏమిటి? సంబంధాలు దెబ్బతింటే ఏంచేయాలనేదానిపై అవసరం. కొంతకాలం గడిచేటప్పటికి జంటలమధ్య సంబంధాలు చెడిపోతాయి. ఇక శృంగారం అంతరిస్తుంది. చివరకు ఈ కాంట్రాక్టు కలయికలలో గర్భాలు తెచ్చుకొని పుట్టిన పిల్లలను ఏం చేయాలో ఎలా పెంచాలో తెలియక సతమతమయ్యేది మహిళ మాత్రమే అనటంలో సందేహం లేదు.