•  

పడకలో సిగ్గు పారిపోవాలంటే...?

To Avoid Feeling Shy In Bed
 
పడకలో సిగ్గు పడుతున్నారా? రతి సమయంలో పురుషులకు సిగ్గు వుండదు. కాని మహిళకు మాత్రం సిగ్గు వదలాలంటే కొంత సమయం పడుతుంది. చాలామంది మహిళలు తమ భావాలు వెలిబుచ్చటానికి సిగ్గు పడుతూంటారు. ఈ కారణంగా వారు సరిగా ఆనందించలేరు, తాము తృప్తి పడలేరు. మరి పడకలో పడతికి సిగ్గు తగ్గించాలంటే...ఏం చేయాలి...పరిశీలించండి.

పడకలో సిగ్గు పారిపోవాలంటే...?
1. మీ భాగస్వామి వద్ద సిగ్గు పోవాలంటే మీరు సౌకర్యవంతంగా వుండాలి. ఆ పరిస్ధితి, అవసరాలు మీకు సౌకర్యంగా వుండేలా చేయాలి.

2. అతను మీ మగడే, మీతో వుండేవాడే అని నిర్ణయించుకోండి. అతనితో సౌకర్యంగా వుండాలంటే లేదా సుఖంగా వుండాలంటే, అతని ప్రేమను పొందాలి.

3. రతి చేసుకోవడం పాపం కాదు. అందులో ఏమీ తప్పులేదు. మీరు హాయి భావిస్తే మీరు కూడా ప్రేమిస్తారు.

4. సిగ్గును అధిగమించాలంటే పార్టనర్ తో మాటలు మొదలుపెట్టండి. మొదట్లో కొంచెం బెరుకుగానే వుంటుంది. మీ ఆలోచనలు ఒకరి కొకరు పంచుకుంటూంటే చక్కటి కలయిక ఏర్పడుతుంది.

5. మహిళలు తరచుగా తమ శరీరం లేదా రూపం గురించి ఆలోచిస్తారు. మీరు కఠినంగా వుంటే, మీ రూపం పాడుచేసుకోవడమే కాక, పురుషుడి మూడ్ పోగొడతారని గుర్తుంచుకోండి.

6. రతిలో ఉద్రేకపడటం మానవ సహజం. దానికి గాను పడకలో మీరు సిగ్గు పడాల్సింది లేదు.

7. అతని స్పందన గమనించండి. ఈ చర్య అతనితో రతిలో ఏ రకంగా సౌకర్యంగా వుండాలనేది మీకు తెలుస్తుంది. మీ సిగ్గును అధిగమించడానికి తోడ్పడుతుంది.

ఈ మార్గాలు ఆచరించి మీ పార్టనర్ తో బెడ్ లో సిగ్గును వదిలేయండి. రతి కార్యం స్వేచ్ఛగా ఇద్దరికి అనుకూలంగా, సౌకర్యవంతంగా వుండాలి. మీరు సిగ్గుపడి బిగుసుకుపోతే, మీరే అతని మూడ్ పాడుచేసి దూరమైపోయేలా చేస్తారు. సిగ్గు ఒక స్ధాయి దాటితే ఆనందాన్ని పాడు చేస్తుందని గుర్తించండి.

English summary
Try these ways to get over the shyness with your partner in bed. Lovemaking should be free and both should be comfortable. If you are shy, you only spoil the mood and turn him off. This shyness may make it difficult to enjoy pleasure. Observe his reaction. This can make you build comfort levels while making love and get over your shyness.
Story first published: Wednesday, April 18, 2012, 12:47 [IST]

Get Notifications from Telugu Indiansutras