•  

రతి తర్వాత జంటలు చేసే ఘోరమైన పనులు!

Horrible Things Couples Do After Romance!
 
శరీరాలు వెడెక్కాయి. రతిక్రీడ అద్భుతంగా సాగిపోయింది. అంతకుముందెన్నడూ పొందనంత ఆనందం పొందారు. చివరగా మీ భాగస్వామి ఉన్నట్లుండి అకస్మాత్ తన స్టడీ టేబుల్ వద్దకు వెళ్ళిపోయాడు. లేదా గుర్రు పెడుతూ నిద్రపోయాడు. ఇక అపుడు మీకెలా వుంటుంది?

తన పార్టనర్తో చక్కటి రతి చేసిన భాగస్వామి ఈ రకంగా సెషన్ ముగిస్తే అంతకంటే మరో తప్పు లేదు. ఈ చిన్న తప్పు ఎంతో అసంతృప్తి కలిగిస్తుంది. రతి తర్వాత చేసే ఈ తప్పులు ....రతి అయిపోతే వెంటనే మరోపని చేయాలనే కోరికను రతికి ముందే సూచిస్తూంటాయి. లేదా సెక్స్ చేస్తూనే వేరే పనులగురించి మీరు ఆలోచిస్తున్నట్లు తెలుపుతాయి.

ఇవి మీరు చేయాలనుకుంటూ చేసిన చర్యలు కాకపోయినప్పటికి పార్టనర్స్ పట్టుబడిపోతూంటారు. పార్టనర్ కు గల ఆనందాన్ని పాడుచేస్తాయి. రతి దశనుండి తమ మైండ్ ను మళ్ళించి పక్కకు పోవటం తన పార్టనర్ కి చేదుగా వుంటుందనేది వారు గ్రహించరు. ఆనందం కంటే కూడా రతి అనేది ఒక డ్యూటీ అన్నట్లుగా వుంటుంది వీరి ప్రవర్తన. సెక్స్ తర్వాత కూడా భాగస్వామి సమక్షంలో చేయాల్సిన పనులు అనేకం వున్నప్పటికి కొంతమంది వేరే విధంగా బిజీ అయిపోయి తప్పు చేస్తారు.

భాగస్వామి తానొక సెక్స్ మెషీన్ వలే వాడుకున్నట్లుగా కూడా భావించే అవకాశం వుంది. మరి ఈ మూడ్ మార్చుకునే జంటలు వారి రతి సంబంధాలను చెడుగా చేసుకుంటున్నట్లే అంటారు మానసిక నిపుణులు. రతి తర్వాత జంటలు సాధారణంగా చేసే తప్పులు ఎలా వుంటాయంటే....

- వెంటనే నిద్రకు ఉపక్రమించడం.

- రతి తర్వాత సడన్ గా వాష్ రూమ్ లోకి వెళ్ళి జననాంగాలు కడిగేయటం

- వెంటనే లేచి, సెల్ ఫోన్ లో తన స్నేహితులతో మాటలు సాగించడం.

- వెంటనే లేచి పుస్తకాలు చదవటం లేక ఆఫీస్ పనిలోకి దిగటం

- మంచంపైనుండి లేచి వేరుగా నిద్రించడం

- పిల్లలను తమతో పడుకోబెట్టుకోవడం

- మరో భోజనం చేయడం

భాగస్వామితో ఆనందకర రతిక్రీడ తర్వాత పై తప్పులు చేయకుండా మరికొంత సమయం ఆనందించండి. వారి శరీరం కూడా వేడి తగ్గాలి. పురుషుడికి పని పూర్తయనప్పుడే మహిళలకు సాంగత్య అవసరం మొదలవుతుందని గ్రహించండి.

English summary
Eating another meal : Eating an aphrodisiacal meal together with your beloved can be a great start before a lovemaking act. But moving to the kitchen right after having sex looking for something to eat is equally disgusting. It ruins the entire passion and would make your partner feel that you didn't enjoy sex just because you were hungry and had food on your mind.
Story first published: Monday, April 23, 2012, 15:58 [IST]

Get Notifications from Telugu Indiansutras