•  

బూతు బొమ్మలు బాదేస్తున్నారా? కళ్ళు పోతాయ్...!

Can Porn Watchers Go Blind?
 
నేటి రోజుల్లో ఎక్కడ చూసినా అశ్లీల చిత్రాలే, బూతు సాహిత్యమే...అతి తేలికగా లభ్యమైపోతోంది. ఇంటర్నెట్ లో ధారాళంగా డవున్ లోడులూ, అప్ లోడులూ జరిగిపోతాయి. అంతేకాదు తనివితీరా యువత ఎంతసేపైనా నెట్ సెంటర్లు, ల్యాప్ టాపులూ, డెస్క్ టాపులూ ఉపయోగించి ఆనందించేస్తున్నారు. కళ్ళకే కాదు, తమ వివిధ అవయావాలకు కూడా పనిపెట్టి మురిసిపోయి మతులు పోగొట్టుకుంటున్నారు. వయసు రాకుండానే వెబ్ సైట్లు తెరచి తహ తహ లాడుతూంటారు. ఇక వాస్తవంలో సగం దుస్తులతో తిరిగే చిన్నారులు కనపడితే చాలు వెర్రెత్తిపోయే కుర్రకారు చొంగలు కార్చే పెద్దవారు కూడా లేకపోలేదు.

పెళ్ళి కాని వారు రతికార్యాలపట్ల ఆసక్తికొరకు చూస్తే, పెళ్ళి అయినవారు, అనుభవాలు రుచిచూసినవారు సైతం వారి రతిని మరింత మెరుగులు పెట్టుకొని అధిక ఆనందంకొరకు వాటిని చూస్తుంటారు. చివరకు రతి క్రీడ చేయటంకన్నా చూడటంలోనే అధిక ఆనందం పొందే వారు కూడా లేకపోలేదు. మరి సమాజం తీరు లైంగిక జీవితాల పట్ల ఈ విధంగా వుంటే ఈ అంశంపై రీసెర్చి చేసిన రీసెర్చర్లు ఏమంటున్నారో పరిశీలించండి.

తాజాగా చేసిన ఒక అధ్యయనంలో, బూతు బొమ్మలు గాఢంగా చూస్తూ వుంటే ఫలితంగా కను గుడ్డుకు రక్తప్రసరణ తగ్గి కనుచూపు మందగిస్తుందని చెపుతున్నారు. కనుక బూతు ఫిలిం లేదా చిత్రాలు చూడటం చివరకు గుడ్డితనానికి దోవ తీస్తుందని నెదర్లాండ్ దేశంలోని గ్రోనిజెన్ మెడికల్ సెంటర్ మరియు యూనివర్శిటీ లోని యూరో న్యూరాలజిస్టు డా. గెర్ట్ హోల్ స్టేజ్ వెల్లడించారు. ప్రత్యేకించి మహిళల కనుచూపు త్వరగా మందగిస్తుందట.

దానికి కారణం బూతు సినిమా చూస్తున్నపుడు మహిళ కళ్ళలో సెక్స్ కోరికలు రాకముందే పూర్తి ఆందోళన ప్రభావించటమేనని కూడా వీరు చెపుతున్నారు. రీసెర్చిలో భాగంగా రీసెర్చర్లు డజను మందికి వరుసగా ఒక మాదిరినుండి తీవ్ర లైంగిక చర్యలున్న అశ్లీల చిత్రాలు చూపారు. వారి మెదల్ళను పిఇటి అంటే పొసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లతో స్కానింగ్ చేశారు. అంతే మహిళల కనుగుడ్డుకు రక్తప్రసరణ గణనీయంగా తగ్గిపోవటాన్ని గమనించారు. ఇది తీవ్రంగా సెక్స్ జరిపే చిత్రాలు చూస్తున్నపుడు మరింత అధికంగా రక్తప్రసరణ తగ్గడం గమనించారట.

మరి ఇదే రీతిలో అశ్లీల చిత్రాలు చూడటం కొనసాగితే, అతి త్వరలో ఎంతో మందికి కంటిచూపు సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. కనుక ఆనందం సంగతి ఎలా వున్నా, నయనం ప్రధానం అన్నారు కనుక, చూసే కంటే కూడా ఆ పని ఏదో చేస్తే మేలని భావించాలి.

English summary
The report adds that as part of a research, a dozen participants all on hormonal birth control were showed three movies– a documentary on Caribbean marine life, a soft-core porn flick and a hard-core one. Using PET (Positron Emission Tomography) scans to peek inside the women’s brains, researchers noted a drop in blood flow to the visual cortex when the participants were watching the hard-core movie.
Story first published: Wednesday, April 25, 2012, 12:35 [IST]

Get Notifications from Telugu Indiansutras