రతి ఎన్ని సార్లు చేశామనేది కాదు. అది ఎంత ఆనందంగా చేశామనేది ప్రధానం. ఒక స్టడీలో శరీరంలోని వ్యాధులతో పోరాడే కణాలు స్కలనం జరుగుతూంటే 20 శాతం పుంజుకుంటాయిట. పురుషులు మంచి శృంగార జీవితంతో 10 సంవత్సరాలు జీవితకాలాన్ని అధికంగా పొందితే, స్త్రీలు ఎనిమిది సంవత్సరాల వరకు తమ జీవితాన్ని పొడిగించుకోగలరట.
స్కలనం జరిగితే ఏమవుతుంది? మన మూడ్ మార్చే రసాయనాలు రిలీజ్ అవుతాయి. చక్కని విశ్రాంతి లభిస్తుంది. సింగల్ గా వుండే వారికంటే, సంతోషంగా వివాహం చేసుకొని జీవించేవారు అధిక కాలం జీవిస్తారు. మహిళలు వారానికి రెండు సార్లు రతి చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుంది.
చక్కటి రతి చేసి స్కలనం చేయాలంటే మెదడులో జరిగే రసాయనిక చర్యలలో నాలుగు రకాల రసాయనాలు అవసరం అవుతాయట. అవి డోపమైన్, ఎసిటీల్ కోలైన్, గాబా మరియు సెరోటోనిన్. డోపమైన్ అనే రతి ప్రేరకం ...తులసి, నల్లని మిరియాలు, మిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, మరియు పసుపులలో వుంటుంది. అంతేకాదు, వారానికి రెండు సార్లు రతిలో పాల్గొనే జంటలలో యాంటీ బాడీలు అధికంగా ఏర్పడి సాధారణంగా వచ్చే జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు కూడా రాకుండా చేస్తున్నాయని స్టడీ తెలుపుతోంది.