•  

ఉరకలెట్టే సుఖాలు - వెనకపడే పెళ్ళిళ్ళు... !

Eroding institution of Marriage
 
కాలం మారింది....అ ..అంటే అమలాపురం...ఊ... అంటే ఊగే జనం...అంటూ యువత. పేరుకి స్నేహం. సుఖానికే ప్రాధాన్యం. స్నేహంలో అదనపు ప్రయోజనం...పడకలు పంచుకోడం. నేడొకరు, రేపు మరి ఒకరు. రోజుకో రుచి, రోజుకో తీరు. ఎక్కడా కట్టుబడి వుండేది లేదు. అంతా తాత్కాలిక సుఖం, అదే రతి సుఖం. ఒక్కరాత్రి కలయికలు, మరుసటి రోజు నీవెవరో నేనెవరో అనటాలు. దీనికి తగినట్లు, బూతు సాహిత్యాలు, బూతు సినిమాలు, క్లబ్బులు, విందులు, వినోదాలు. పార్టీలపేరుతో డ్యాన్సులు, అర్ధరాత్రి కామకేళి. ఇదీ జనరేషన్ నెక్స్ట్ గా పిలువబడే యువతకుగల కామ గోల. పెళ్ళైనవ వారికి సైతం కొత్తదన రతి సుఖాలకు వెంపర్లాట.

వింటే జనం భయానికి గురవుతారు. షాక్ తిని దిమ్మతిరుగుతుంది. కాని మెట్రోలలో జరిగే వాస్తవాలు. సంవత్సరాల తరబడి నడుస్తున్న అతి సాధారణ సెక్స్ సంబంధాలు. పాశ్చాత్య వ్యామోహంలు పడి కొట్టుకుంటున్న కామ క్రీడలు. సామాజిక విలువలను జీరో చేసే యువతీ యువకులు. వివాహ బంధాలవంటివాటికి అసస్సలు సమయంలేదంటున్నారు. కాని కామ బంధాలు వీరికి కావాలి. అదనపు ప్రయోజనం ఇచ్చే ఫ్రెండ్ రొటీన్ బోర్ నుండి విముక్తి కలిగిస్తాడు. అదే వీరి భావన

గాల్ ఫ్రెండ్ కోరికలు తీర్చే టైమ్ లేదు. వివాహం చేసుకునే సమయం, ఆమెతో లేదా ఆమె తల్లితండ్రులతో కట్టుబడి వుండే సమయం అంతకంటే లేదు. మా బాగోగులు మాకు బాగా తెలుసు అనేస్తున్నారు ఇరవై సంవత్సరాలలోకి వచ్చేసిన యువతీ యువకులు. మన భారతీయులు ఎంత సాంప్రదాయబద్ధంగా వున్నప్పటికి ఏ మాత్రం కట్టుబాట్లు లేని రతి సుఖం యువతలో సర్వసాధారణమైపోతోంది. పాశ్చాత్య వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నాం. రతి సుఖం వేరు, సంబంధాలు వేరు అనే దశకు వచ్చేశాం. యువతులు సైతం ఇదే భావనలో మితిమీరిన మజాలో ఆనందించేస్తున్నారు. పెళ్ళి, పేరంటాలు, పాత పద్ధతులైపోతున్నాయి. అదే మార్గంలో వెనుకబడిపోతున్నాయి. కోర్కెలు తీర్చేసుకుంటున్న యువతకు ఆ కోర్కెలు తీరే వివాహ బంధ మార్గంలో నమ్మకం సడలిపోతోంది. ఎప్పటికపుడు పెళ్ళిళ్ళు వాయిదాలు వేసుకుంటూ, వయసు మీదపడినాసరే, తీరిన కోర్కెలతో ఒంటరి జీవితాలనే కొనసాగిస్తున్నారు. వీరంతా ఆచారాలు, సంప్రదాయాలను మార్చాలనే ధ్యేయంగా కూడా కొనసాగే పరిస్ధితి వచ్చేసింది.

English summary
They are just friends outside - going out, partying, catching up over adda. But in the bedroom, they're mates in the true sense of the word. That's why they're called friends with benefits, or - in GenNext lingo - f*** buddies.
Story first published: Monday, February 13, 2012, 19:11 [IST]

Get Notifications from Telugu Indiansutras