లైంగిక విషయాలు చర్చించడం తప్పనుకుంటారు. వీరిలో రతి సమయంలో భావప్రాప్తి పొందకపోవటం ఒక సాధారణం. ఇది వారికి రతి పట్ల తిరస్కారం లేదా వారి పెంపకాలపై కూడా ఆధారపడి వుంటుంది. కాని కొన్నిసార్లు భావప్రాప్తి మహిళలు శారీరక కారణంగా కూడా పొందలేరు. అయితే, కొద్దిపాటి మార్గదర్శకతతో వీరు లైంగిక చర్యలలో నిపుణులుగా కూడా రాణించగలరు.
మహిళకు ఒక సారి భావప్రాప్తి లేదా స్కలనం జరిగిందంటే, రెండో సారి భావప్రాప్తి తేలికవుతుంది. ఒకే సెషన్ లో రెండు లేదా మూడు సార్లు సైతం ఆమె భావప్రాప్తి పొందే అవకాశం వుంది. కాని పురుషుడి అంగం, ఫోర్ ప్లే, అతని శారీరక చర్యలు వంటివి అందుకు మరల సహకరించాలి. సినిమాలలో చూసి అది కావాలనుకునే జంటలు అవాస్తవంలో బతుకుతున్నారని కూడా చెప్పాలి. చాలామంది యువతులు వారు ఆశించినంత ఆనందం లైంగిక చర్యలలో దొరకటం లేదని ఆందోళనలో వుంటారు. మహిళలో భావప్రాప్తి కలగకపోవటానికి రతిలో ఆమెకు కోర్కె లేకపోవటం, లేదా తగ్గిన కామవాంఛ లేదా అంగం వద్ద సరైన ద్రవాలు ఊరకపోవటంతో రతిలో కలిగే బాధాకరమైన అనుభవం లేదా ఆమెకు క్లయిమాక్స్ కు చేరే శక్తి లేకపోవటం.
మరి దీనికి మార్గం ఏమిటి?
ఈ రకమైన మహిళలు సెక్స్ నిపుణులను సంప్రదించాలి. వారు ఆమె గత జీవితాన్ని స్టడీ చేసి ఆమెను ఏ రకమైన చర్యలు లైంగిక చర్యలకు ప్రోత్సహిస్తాయి, ఏ రకంగా ఆమె భావప్రాప్తి తేలికగా పొందగలదు అనే అంశాలు వివరిస్తారు. కొన్నిమార్లు పుస్తకాలు, వీడియోలలో దొరికే సమాచారం కూడా సహాకరిస్తుంది. కొన్ని మెళకువులు ఒక్కొక్కపుడు మహిళలకు భావప్రాప్తి పొందటంలో బాగా సహకరిస్తాయి. రతి ఆనందం అనుభవించాలంటే ఒకటే సరైన మార్గం అంటూ ఏదీ లేదు. ప్రతివారు తమ గత అనుభవాలను జోడించి వారికవసరమైన రీతిలో లైంగిక చర్యల ఆనందం పొంది భావప్రాప్తి కలిగించుకోవచ్చు.