•  

పండంటి పెదవంటే...పడిచచ్చే పురుషుడు!

 

Hotromantic
 
మహిళకు పురుషుడికి మధ్య ఆకర్షణ సహజమైనదే. ఇక పురుషులను సమ్మోహింపచేసి ఆకర్షించటం అనేది రతిక్రీడల్లో మరింత ప్రధాన పాత్ర వహిస్తుంది. అధికంగా వివాహమైన తర్వాత తగ్గిపోయే ఆకర్షణను పెంచాలంటే మహిళలు ఈరకమైన సమ్మోహక చర్యలకు నడుం కడతారు. ఆకర్షణ అనేది ఎప్పటికి ఒక మిస్టరీ యే. అయితే, ఆకర్షించటానికి అవలంబించే కొన్ని మార్గాలు తెలుసుకొని ప్రేమలోని ఆనందం అనుభవించండి.

మహిళలు పురుషులను వివిధ రకాలుగా ఆకర్షించటమనేది ప్రాచీన కాలంనుండి వస్తోంది. మొదట్లో మహిళలు అందంగా తయారై పురుషులను పెళ్ళాడేవారు. ఇక వివాహ జీవితంలో అనంతమైన ప్రేమ పొర్లి ప్రవహించేది. ఆ విధంగా మొదలైన ప్రేమ కాలానుగుణంగా తగ్గిపోతూండటంతో మహిళలు కొత్త కొత్త మార్గాలను అన్వేషించి పురుషులను ఆకర్షిస్తున్నారు. ఇక తాజాగా నేటి ఆధునిక రోజులలో మహిళలు ఆచరించాల్సిన కొన్ని చిట్కాలు చూడండి.

వివాహిత మహిళ ఎప్పటికపుడు కొత్త రకం విధానాలు ఆచరిస్తూ తన పురుషుడిని ఆనందించి తాను కూడా ఆనందం పొందాల్సిందే. పురుషుడు బాగా ఇష్టపడేది....ఆమె వెంట్రుకలు మంచి సుగంధపు వాసన వస్తుంటే. కనుక మీ కేశాల్ని బెడ్ చేరే ముందు బాగా వాష్ చేసి సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్ వేయండి. మెత్తగా అలలవలే గాలికి చెదిరే ముంగురులు మీ మగాడ్ని మురిపిస్తాయి.

ఆకర్షణీయంగా వెలిగిపోయే ముఖం, సమ్మోహపరచే కళ్ళు మీ పార్టనర్ ని తేలికగా మీరు అందంగా వున్నారనిపించేస్తాయి. మేకప్ తక్కువగా చేసుకోండి. కాని మీ కళ్ళను మేజికల్ గా వుండేలా నల్లని కాజల్ తో అలంకరించండి. బుగ్గలపై రోజ్, పెదాలపై పండులా మెరిసే ఎర్రని లిప్ స్టిక్ వేయండి. ఇక ఎంతో ఆకర్షణీయంగా కనపడతారు. పొడవాటిగా సాగిన మెడ మరో ప్రత్యేక కామ వాంఛ కలిగించే ప్రదేశం. మెడపై కొద్దిపాటి సువాసననిచ్చే పెర్ఫ్యూమ్ చల్లండి. మత్తెక్కించాలంటే, సువాసనలు ప్రధానం. అవి మీ భర్తను తప్పక మెప్పిస్తాయి.

సెక్సీగా వుండి చూడంగానే మిమ్మల్ని పడుకోపెట్టేయగల లోదుస్తులను ధరించండి. లేసులు వుండే లో దుస్తులైతే చూపులకు మరింత వేడిగా వుంటాయి. వక్షోజాలపై కనీకనపడనట్లుండే చిన్న టాప్ ఏదైనా వేయండి. ఇక అతను చూపు తిప్పుకోలేడు. మీ చేతి వేళ్ళకు రంగు వేయటం మరువకండి. డార్క్ కలర్ ఏదైనా బాగానే వుంటుంది. అదివరకు రోజులలో మహిళలు గోళ్ళ రంగులకై చాలా సమయం తీసుకునేవారు. ఇవి మహిళలను సెక్సీగా వుంచుతాయి. ఈ కారణంగానే పెళ్ళి అంటే చాలు....మెహందీ అంటు యువతులు పరుగులు పెడతారు. సన్నని డిజైన్లతో చేతులు, అరచేతులు మెహందీ అలంకరణ చేస్తే చేయి ఆకర్షణగా వుంటుంది. మణికట్టుకు కొంచెం సెంట్ కూడా రాయండి.

మీరు ధరించిన దుస్తులనుండి ఆకర్షణీయమైన, మెత్తటి, నున్నటి కాళ్లు బయటకు కనపడాలి. కాలి గోళ్ళకు కూడా రంగు వేయటం మరువకండి. ఇక మీరు తయారైపోయారనుకుంటే చాలదు. మీరు కూర్చున్న ప్రదేశం మరింత రెచ్చగొట్టేదిగా వుండాలి. సువాసనలనిచ్చే కేండిల్స్ వెలిగించండి. శాటిన్ బెడ్ కవర్ తళ తళ మనిపించండి. డిమ్ లైట్లు, వాసన నిచ్చే కేండిల్స్, అద్భుతా అలంకరణతో మీరు, ఇక పురుషుడిని బెడ్ పై వాల్చేయటానికి సరైన సమయం వచ్చేసినట్లే. ఆ పై జరిగేది మీ చేతిలో లేదు.
English summary
Create the right ambience for the magic of seduction. Light perfumed candles and spread a satin bedcover to play the perfect host to seduce your husband. Soft dimmed lights, the musky smell of the candles will create the sparkle and the rest will carry on automatically once the ambience is right.
Story first published: Tuesday, January 3, 2012, 15:37 [IST]

Get Notifications from Telugu Indiansutras