•  

అరగంట రతిలో 250 కేలరీలు డవున్!

Romance for half hour burns 250 calories!
 
ఇకపై బరువు తగ్గాలంటూ ఖర్చుతోకూడిన పనులు జిమ్ కి వెళ్ళటం, ట్రెడ్ మిల్ పై పరుగులు పెట్టటం వంటివి చేయనవసరంలేదు అన్నిటికంటే అతి చౌక సెక్సోయామం అని పరిశోధకులు చెపుతున్నారు. బరువు తగ్గుతందంటే చాలు, దినమంతా పని చేసినా సరే అమ్మడు......అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటానికి ఇష్టపడుతుందని మహిళలపై చేసిన ఒక స్టడీ వెల్లడించింది. రీసెర్చిలో పరిశోధకులు సంప్రదించిన వారిలో 76 శాతం మహిళలు తమ కొవ్వు కరిగించుకోటానికిగాను ప్రతిరోజూ కార్యక్రమంలో రతిక్రీడను ఎంచుకోటానికే మక్కువ చూపినట్లు వెల్లడైంది.

జిమ్ లలో సభ్యత్వాలున్న మహిళలలో మూడోంతులమంది రతిక్రీడ అయినా సరే లేదా అలాంటి వ్యాయామాలు మరేవైనా సరే సంతోషంగా చేయటానికి అంగీకరించినట్లు పరిశోధన తెలిపింది. అరగంట పాటు కొనసాగించే రతి ఆహారం సుమారు 150 నుండి 250 కేలరీల శక్తి వ్యయం చేయగలదని మరింత చురుకుగా కొనసాగించే వారిలో 350 కేలరీలు కూడా ఖర్చు చేస్తుందని రీసెర్చర్ కెర్రీ మెక్ క్లోస్కే తన పుస్తకం 'ది అల్టిమేట్ సెక్స్ డైట్ " అనే పుస్తకంలో పేర్కొన్నారట. నిజంగానే పూర్తి రతి చేయకుండా డమ్మీరతితో గాఢమైన ముద్దులు మురిపాలతో ఒక అరగంట గడిపితే చాలు కనీసం 200 కేలరీల వరకు శక్తి ఖర్చవుతుందట.

సర్వేని నిర్వహించిన ఆస్పైర్ డ్రింక్స్ కంపెనీ యజమాని డారెన్ లైనెల్ మేరకు ప్రతిరోజూ దినచర్యలో భాగంగా రతి చేస్తూనే అధికబరువు తగ్గించేయవచ్చని తెలిపినట్లు ది డెయిలీ మెయిల్ పత్రిక పేర్కొంది. మనకు తెలియని చిన్న చిన్న విషయాలు కూడా ఒక్కొక్కపుడు పెద్ద ఫలితాలనివ్వగలవని రీసెర్చర్లు తెలుపుతున్నారు.

English summary
Research showed that 76 per cent of women are more inclined to weave the nocturnal workout into their routines if they think they will burn calories."We are burning calories constantly as we go about our day to day business," the Daily Mail quoted Darren Linnell, creator of Aspire drinks who commissioned the survey, as saying.
Story first published: Sunday, January 22, 2012, 15:42 [IST]

Get Notifications from Telugu Indiansutras