సాధారణంగా మనిషికి ఎన్నో రకాల సమస్యలుంటాయి. అందులో సెక్స్ సమస్యలైతే మరీనూ. యువతీ యువకులలో రకరకాల సందేహాలు పుట్టుకొస్తుంటాయి. అలాంటి సందేహాలలో వీర్యం అంటే ఏమిటి అనేది ప్రధానంగా కలుగుతుంది. వీర్యం అంటే.... శుక్ర కణాలను వీర్య కణాలని కూడా అంటారు. వీర్యం అనేది శక్తిని కలిగించేది, మలరహితం, చాలా పవిత్రమైంది. కాబట్టే దీనిని వీర్యం అంటారు. ఈ వీర్య కణాల వలన ఓ కొత్త శరీరం పుట్టుకొస్తుంది. కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. శుక్రకణాలు మూత్రనాళంలో తయారవుతాయి. ఇవి ద్రవరూపంలో ఉంటాయి. ఈ ద్రవమే స్ఖలనం సమయంలో అంగం నుంచి బయట పడుతుంది. పురుషత్వం దీనిపైనే ఆధారపడివుంటుంది. పురుషుడు నపుంసకుడు కాదు అనటానికి అంగ స్తంభన, దానినుండి రాపిడిలో స్కలనమవటం నిదర్శనంగా చెప్పవచ్చు. మనిషి శరీరంలో ఏడు ధాతువులుంటాయి. ఈ ధాతువులలో ఏడవది శుక్ర ధాతువు. ఇది చాలా శ్రేష్టమైంది. రక్తం, మాంసం, మేదం, శుక్ర తదితర ధాతువులతో శరీరనిర్మాణం ఏర్పడుతుంది.
వృషణాలలో బాగా వేడి కలిగితే వీర్యకణాలు నశించిపోతూంటాయి. ఈ కారణంగానే వృషణాలను శరీర వేడికంటే కూడా తక్కువగా వుండి గాలి బాగా ఆడేలా వేడి తగలకుండా శరీరానికి అంటుకోకుండా వేలాడేలా ప్రకృతి నిర్దేశించింది. వీర్య కణాలు కొద్దిపాటి వేడి వుంటే చాలు నశిస్తాయి. వీర్యకణాలు నశిస్తే, ఇటువంటివారికి అంగ స్తంభనలతోపాటు సంతానం కలగటం కూడా కష్టమవుతుందంటారు పరిశోధకులు.
వీర్యవృధ్ధి కలిగి ఎప్పటికపుడు కామవాంఛ కలిగి అంగస్తంభనలు జరగాలంటే బూడిదగుమ్మడి రసం, అరటిపండు, ములక్కాడలు, ముల్లంగిరసం, వంటివి వేడిని తగ్గించి వీర్యవృధ్ధిని, సాధారణ శారీరక పటుత్వాన్ని కలిగిస్తాయంటారు వైద్య పరిశోధకులు. శరీరానికి కూడా చలువచేసేటందుకు కరుబూజపండు, సొరగింజలు, గుమ్మడిగింజలు, దోసగింజలు కూడా మేలు చేస్తాయి. బూడిద గుమ్మడికాయను హల్వాలా చేసుకుని తింటే బాగా చలువ చేస్తుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.