
మీ మత్తెక్కించే మగువ ఆనందానికి చెమటోడ్చి మంచి వ్యాయామాలు ప్రతిరోజూ చేయండి. వ్యాయామంలో అనేక ప్రయోజనాలున్నాయి. వాటిలో సమర్ధవంతమైన రతి ఒకటి. ఆనందం అధికం చేయడంతోపాటు బ్లడ్ సర్కులేషన్ బాగుండి మీ గుండెకు కూడా మేలు చేస్తుంది. శరీరంలోని ఎండార్ఫిన్లు రతిక్రీడకు బాగా తోడ్పడతాయి. ఇక మీరు మీ పార్టనర్ ఇద్దరికి సెక్స్ అనుభూతులే, ఆనందాలే.
రక్తనాళాలలో అడ్డంకులేర్పడి జననాంగానికి రక్తప్రసరణ లేకుంటే సమస్య. కనుక ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించి బలాన్ని పెంచుకోండి. గుండె పంపింగ్ కు మీ అంగస్తంభనకు గల సంబంధాన్ని డాక్టర్లు వివరించేవుంటారు. కామాన్ని పెంచే ఆహారాలు తినండి. పొగతాగడం మీ రక్తనాళాలను ఫలితంగా జననాంగాన్ని దెబ్బతీస్తుంది. జననాంగానికి రక్తం చేరకుండా చేసే ప్రధాన అలవాటు స్మాకింగ్. వీర్య కణాలలో నాణ్యతను కూడా ఇది తగ్గిస్తుంది.
ఆల్కహాల్, కాఫీలు అధికంగా వున్నాయా? వెంటనే జాగ్రత్తపడండి. సిగరెట్ లోని నికోటిన్ వలేనే కేఫైన్ కూడా రక్తనాళాల గడ్డలకు దోహదం చేస్తుంది. ఫలితంగా అంగస్తంభనకవసరమైన రక్తం అక్కడకు చేరదు. డ్రింక్ చేస్తే మూడ్ వచ్చే మాట వాస్తవమే. అయితే అది అంగస్తంభనకవసరమైన మానసిక పరిస్ధితిని అణచివేస్తుంది. అందుకని పురుషులైతే రెండు పెగ్గులు, మహిళలైతే ఒక పెగ్గు ఆల్కహాల్ తో మాత్రమే సరిపెట్టి, సంభోగానికి సిద్ధమైపోండి.



Click it and Unblock the Notifications



