•  

నేరుగా అంగప్రవేశం ఆహ్లాదాన్నిస్తుందా?

Kissing
 
సెక్స్ అనేది భార్యా భర్తలిరువురూ ఒకే రీతిలో ఆనందించాల్సిన అంశం. రతిక్రీడలలో హడావుడి, త్వరగా చర్యలు చేసేయడం వంటివి పనికిరావు. ఎంత ఎక్కువ సమయం రతిక్రీడలో పాల్గొంటే అంత అధికంగా ఆనందం సొంతమవుతుంది. మరచిపోలేని అనుభూతులు కలుగుతాయి. అందుకే రతిక్రీడకు అనువైన బెడ్ రూమ్ వాతావరణాన్ని కల్పించుకోవాలి. నిర్దేశిత ప్రదేశంలో మాత్రమే ఆ ఆనందాన్ని పరిపూర్ణంగా పొందగలరు.

రతిక్రీడకి ఉపక్రమించే ముందు సైతం భాగస్వామితో ఎంతో మానసిక సంసిద్ధత అవసరం. చుట్టూ ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండాలి. దానికిగాను బెడ్ రూమ్ లో మంచి అలంకరణ, మూడ్ తెప్పించే చిత్రాలు, సుగంధ ద్రవ్యాల వాసనలు, రుచికర తినుబండారాలు సాధారణంగా పూర్వపు రోజులలో వుంచేవారు. చప్పుడు చేసే వస్తువులు, కిర్రుమనే పడకలు, తలుపులు వేసుకున్న వెంటనే పిల్లల ఏడుపులు, లేదా పెద్దవారు పిలవటాలు వంటివి రతి సుఖానికి అడ్డుగోడలుగా నిలుస్తాయి. స్త్రీపురుషులిరువురూ సెక్స్‌కు ఉత్సాహంగా రెడీ అయినప్పటికి ప్రక్కనే శబ్దాలను కలిగించే పనిముట్లు లేదా ఇతర సంఘటనలు వుంటే... అంతా ఉఫ్.. అంటూ సోలిపోవాల్సి వస్తుంది. ఆనందం కోల్పోవాల్సివస్తుంది.

మనసులో మొదలయ్యే కోరిక క్రమంగా శరీరానికి పూర్తిగా వ్యాపించినపుడే రతిక్రీడ చక్కటి క్రీడగా మారి ఇరువురికి పూర్తి ఆనందాన్ని చేకూర్చకలదు. రతికి ముందు ఆ ఆనందానికి భంగం కలిగించే సెల్‌ఫోన్ లేదా టి.వి.లోని కార్యక్రమాల వంటివి వీలైనంత దూరంగా పెట్టాలి. ఆ తర్వాత భాగస్వాములిరువురూ తమ కళ్ళతోను, వివిధ చేష్టలతోను కోరికలు వ్యక్తం చేసుకుంటూ ఆనందించాలి.

ముద్దులు, గాఢ కౌగలింతలు, పులకించే స్పర్శలు.. వంటివి కనీసం పావుగంట నుంచి అరగంట వరకైనా సాగాలి. ఆ తర్వాతే అసలు జననాంగాలకు పనిచెప్పాలి. ఈ రకంగా ముందస్తు చర్యలతో సాగే రతిక్రీడలో అసంతృప్తి అనేది ఉండదు. అంతేకాని ఏకంగా ఒకేసారి జననాంగాలకు పనికల్పించి, ఎవరిదోవన వారు స్కలనాలాచరించి, అదో పనిలా ఆ కార్యక్రమాన్ని ముగించి ఒక పని అయిపోయింది అన్నట్లుగావుంటే భాగస్వామిలో అసంతృప్తి పెల్లుబుకుతుంది. దాని ప్రభావం మీ సెక్స్ జీవితంపై కొనసాగుతూనే వుంటుంది.



English summary
The Couple should atleast spend their time for foreplay for 15 to 30 minutes. Then only the Whole body gets activated for the ensuing sex and both the partners can enjoy fully. The moment they start doing sex without foreplay and got ejaculated the partner gets dissatisfied and this would reflect in their future life.
Story first published: Sunday, January 8, 2012, 13:17 [IST]

Get Notifications from Telugu Indiansutras