•  

అమ్మడికి సెకండ్ రౌండ్ ....జీరో....

Good if men sleep after Romance
 
భీభత్స రతిక్రీడ తర్వాత పురుషుడు ఫ్లాట్ అయి గురకలు పెట్టేస్తున్నాడా? మీకు తృప్తి కలగక ఆలోచనలో పడ్డారా? అయినా పరవాలేదు. దీనిని గమనించండి.

పెన్సిల్వానియాలోని ఆల్ బ్రైట్ కాలేజీ, మిచిగాన్ యూనివర్శిటీ సైకాలజిస్టులు ఇటువంటి పురుషులపై ఒక అధ్యయనం నిర్వహించారు. రతిక్రీడ అయిన వెంటనే పురుషుడు కనుక గాఢంగా గుర్రు పెట్టేస్తూ నిద్రిస్తే అది భాగస్వామిపై గాఢ వాంఛను, ప్రేమానురాగాలను తెలుపుతుందట. రతి తర్వాత పురుషుడు ఎంత గాఢంగా గురకలు పెట్టి నిద్రిస్తే, తన సహచరిణిపై అంత ప్రేమానురాగాలు వున్నట్లని మిచిగాన్ యూనివర్శిటీ రీసెర్చి ప్రొఫెసర్, స్టడీ నిర్వహించిన అధ్యయన కారుడు డేనియల్ కృగర్ తెలిపారు.

ఈ స్టడీ అంశాలను జర్నల్ ఆఫ్ సోషల్, ఎవల్యూషనరీ, అండ్ కల్చరల్ సైకాలజీ ప్రచురించింది. పరిశోధనలో సుమారు 456 మంది పురుషులు పాల్గొన్నారు. వీరిని సర్వే చేస్తే, తామంతా రతిక్రీడ ఆచరించటం ఆలస్యం నిద్రలోకి జారుకుంటామని, తమ భాగస్వాములపై అంతులేని ప్రేమానురాగాలున్నాయని తెలిపారట.

అయితే, ఇలా నిద్రపోయే వీరు రతి తర్వాత తమ సహచరుణులతో చక్కటి సంభాషణలు సాగించాలని, ఆమెను ముద్దులు కౌగిలింతలతో ముంచెత్తాలని వుంటుందని కూడా ఒప్పేసుకున్నారట. అయితే, ముంచుకు వచ్చే నిద్ర కారణంగా ఆ పని చేయలేకపోతున్నట్లు వాపోయారట. రతిక్రీడ తర్వాత భాగస్వాములలో ముందుగా మహిళలు నిద్రిస్తున్నారా? లేక పురుషులు నిద్రిస్తున్నారా అనేది కూడా వీరు పరిశోధించారు. అందులో పురుషులే ముందు హాయిగా నిద్రిస్తున్నట్లు తేలింది. అయితే, రతిక్రీడ ఆచరించని రోజులో మాత్రం పురుషులకంటే ముందుగా మహిళలే నిద్రిస్తున్నట్లుగా కూడా పరిశోధన తెలిపింది.

మరి పురుషులు సెక్స్ చేయని రోజుల్లో ఆలస్యంగా నిద్రించే కారణం ....ఒకటి ఆమె తనను వదలి మరో పురుషుడితో సెక్స్ కు తలపడుతుందేమోనని, రెండోదిగా ఆమె తనతో ఎపుడు సెక్స్ కార్యక్రమానికి దిగుతుందా అని వెయిట్ చేయడంగా వుందని కూడా పరిశోధకులు వెల్లడించారు.English summary
The study also looked at who were more likely - men or women - to fall asleep first. Despite the common stereotype, the researchers did not find it more common for men to fall asleep first after sex. Women, however, were more likely to fall asleep first when sex hadn't taken place.
Story first published: Monday, January 30, 2012, 16:31 [IST]

Get Notifications from Telugu Indiansutras