•  

కన్నెపొర అంగప్రవేశంలో.. చినగకపోతే?

Katr
 కన్నెపొర కరెక్టుగా అంగప్రవేశంలో చినగకపోతే ఆమె కన్య కాదా? నోటి రతి చేస్తే వీర్యం కడుపులోకి పోయి గర్భవతులయిపోతారా? సరిగ్గా స్కలన సమయంలో అంగం యోనినుండి బయటకు లాగేసి బయట స్కలనం చేస్తే కన్య సురక్షితమా? నేను చేసేది మొదటి రతే....నాకేం గర్భం రాదు? అతని కాళ్ళు బాగా పొడవు దాన్నిబట్టి అతని అంగం సైజు నే చెప్పేస్తా? పిరీయడ్స్ లో రతి చేస్తే గర్భం రాదు! ప్రతిఒక్కరికి ఎన్ని సార్లు ఈ అంశాలు విన్నప్పటికి, తమదాకా వచ్చేటప్పటికి అన్నీ అనుమానాలే. సెక్స్ అందరకూ తెలుసు. కాని సెక్స్ ఎడ్యుకేషన్ చాలామందికి తెలియక ఎన్నో అపోహలు కలిగి వుంటారు. ఇంటర్నెట్ లో కావలసినంత సమాచారం దొరుకుతోంది. కాని వాస్తవానికి అపోహలకు మద్య తేడా నిర్ణయించుకోలేకపోతున్నారు. వీటన్నిటికి మా సమాధానాలు పరిశీలించండి.

- కన్నెపొర అంగప్రవేశంలో ఖచ్చితంగా చినిగితేనే ఆమె కన్య అనేది కూడా అపోహే. ఏ చిన్నపాటి ఒరిపిడి కలిగినా సరే కన్నెపొర చినిగిపోతుంది. అంగం ప్రవేశంతోనే అది చినగాల్సిన అవసరంలేదు.
- నోటి రతిలో మహిళకు గర్భం రాదు. ఆమె వీర్యం మింగినా సరే రాదు. అదే విధంగా గుదరతిలో సైతం ఆమెకు గర్భం వచ్చే అవకాశం లేదు.
- యోనిబయట స్కలనం చేసినప్పటికి, కొద్దిపాటి చుక్కల వీర్యం యోనిలో స్పందించి గర్భం కలిగించే అవకాశాలుంటాయని గ్రహించండి. కనుక సెక్స్ తర్వాత మహిళలు తప్పక గర్భ నిరోధక మాత్రలు వాడాలి.
- మొదటిసారి సెక్స్ లో గర్భం రాదనేదేమీ లేదు. ఎపుడైనా రావచ్చు. కనుక సెక్స్ ఎపుడు చేసినా కండోమ్ ఉపయోగించండి.
- కాళ్ళు పొడవైనంత మాత్రాన , అంగం పొడవు వుండదు. ఇది ఎప్పటినుండో వచ్చే అపోహ మాత్రమే.
- గర్భ నిరోధక సాధనాలు లేకుండా పిరీయడ్స్ లో పాల్గొన్నప్పటికి గర్భం వచ్చేస్తుంది. మహిళకు ఏ సమయంలో అయినా సరే గర్భం ధరించే అవకాశం వుంది. వీర్యకణాలు కొన్ని రోజులు బతికివుంటాయి. కనుక పిరీయడ్స్ లో చేసే రతిలోని వీర్య కణాలు తర్వాతైనా సరే గర్భం కలిగించవచ్చు.

English summary
Much to the dismay of many women, this is so not true. As soon as a man gets an erection he starts producing fluid which includes sperms which is enough for a woman to get pregnant. If you are not on a baby-making session and having unprotected sex, we advise you to take pills after sex.
Story first published: Saturday, January 7, 2012, 14:48 [IST]

Get Notifications from Telugu Indiansutras