ఎలా ఉపయోగించాలి?
ముందుగా చేతులు శుభ్రం చేసుకోండి. పా్యకెట్ జాగ్రత్తగా తెరవండి. రతిక్రీడకు ముందు ఎనిమిదిగంటలముందే యోనిలో పెట్టుంచాలి. యోనిలోపల పెట్టిన తర్వాత సౌకర్యవంతంగా వుందో లేదో చూడండి. కాళ్ళు వెడల్పుచేసి కూర్చొని, పడుకొని కాళ్ళు వంచి సౌకర్యం చెక్ చేయాలి. యోనిలోపల పెట్టేముందు దానికి తగిన జిగురు వుందోలేదో పరిశీలించండి. లేకుంటే కొంత జిగురు లేదా లూబ్రికేషన్ చేస్తే, సెక్స్ మధ్యలో ఇబ్బందిలేకుండా వుంటుంది. కండోమ్ ఒక కొన యోని లోపల మరొక కొన లేదా చివరి భాగం బయటకు కొంచెం వేలాడేలా వుండాలి. మెల్లగా చూపుడు వేలితో లోపలికి తోసేయాలి. ఈ ఏర్పాటు మీ పార్టనర్ నే చేయమని అడిగితే, అతను ఎంతో హేపీ గా భావించి చాలా ఖచ్చితంగా చేసి మీ మెప్పు పొందుతాడు. మీకు ఫోర్ ప్లేగాను వుంటుంది.
కండోమ్ ను యోని లోపల మెలిక పడకుండా తిన్నగా వుండేలా చూడండి. మీ చేతితో పురుషాంగాన్ని పట్టుకొని మెల్లగా కండోమ్ లోకి ప్రవేశ పెట్టండి. కండోమ్ బయటి యోని భాగంలో పురుషాంగం ఎక్కకుండా చూసుకోవాలి. రతిక్రీడ అదురుకి కండోమ్ యోనిలోపల పడిపోతే, రతి వెంటనే ఆపేయాలి, కండోమ్ ను మహిళ యోనినుండి జాగ్రత్తగా బయటకు లాగాలి. రతిక్రీడ అయిపోయిన తర్వాత యోని బయటకు వున్న కండోమ్ చివరి రింగ్ మెలిపెట్టి కండోమ్ లోని ద్రవాలు లోపలికి చిమ్మకుండా బయటకు మాత్రమే వచ్చేలా కండోమ్ లాగేయాలి. ఆ కండోమ్ రెండోసారి వాడకండి. టాయ్ లెట్ లో పడేయండి. మహిళా కండోమ్ లను గుద రతికి ఎట్టిపరిస్ధితులలోను ఉపయోగించకండి. చాలా నొప్పి పెడుతుంది. హెచ్ ఐవి సోకటం లేదా గుదం నుండి రక్తం రావటం కూడా జరుగుతుంది.