నేటి ఆధునిక నగర జీవన వేగాలు పరిశీలిస్తే....జంటలకు ఇంటిలో తమ రతి ఆనందానికి కూడా సమయం దొరకటం కష్టమైపోతోంది. ఒకరికి రాత్రి డ్యూటీ అయితే, మరొకరికి పగలు డ్యూటీ. ఏం చేయాలో తెలియని పరిస్ధితి. ఒకే రూఫ్ క్రింద వుంటున్నా ఒకరిని మరి ఒకరు చూసుకోవడమనేది సెలవు దినాలలోనే. అదికూడా వారి వారాంతపు సెలవులు పర్మిట్ చేస్తే తప్ప. మరి కోరిక కలిగినపుడు ఇక గత్యంతరంలేక ఎవరికి వారు స్వయం రతి చేసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు చెపుతున్నాయి. ఈ సర్వేలలో పురుషులలో 94 శాతం మంది, మహిళలలో 89 శాతం మంది రెగ్యులర్ గా స్వయం రతికి పాల్పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హస్తమైధునం వంటివి మీ శరీరానికి ఏ మాత్రం హానికరంకాదు. అది మీరు మరీ అధికంగా చేస్తే తప్ప అంటారు విషయ నిపుణులు.
హస్తమైధునం చేయొచ్చా? చేయొచ్చు. దీనివలన ఆరోగ్య రీత్యా అనేక ప్రయోజనాలున్నాయి. నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన, రుతుక్రమంలో నొప్పి, డిప్రెషన్ వంటివి నివారిస్తుంది. కొన్ని కేలరీలు ఖర్చవుతాయి. ఎంతో హాయినిస్తుంది. ఊహల్లో, భ్రమల్లో సెలిబ్రిటీలను సైతం తలుచుకుంటూ స్వయం రతి చేసుకోడంతో జీవితంలోనే అధికమైన భావప్రాప్తి పొందుతారు. సురక్షితమైన సెక్స్ అంటే స్వయం మైధునమే. గర్భం వస్తుందని, లేదా సుఖ వ్యాధులు వస్తాయని భయంలేదు. ఉచితంగా లభించేదే. కనుక మీ శరీరంతో ఏదైనా చేయండి.
స్వయం మైధునం సాధారణమే. సహజమైన చర్య. దీనివలన, పిల్లలు పుట్టరని, సెక్స్ పరంగా బలహీనపడతారని, కోరిక నశిస్తుందని మొదలైనవి అపోహలు మాత్రమే. కోతులు, కుక్కలు, పిల్లులు కూడా ఈ చర్య జరుపుకుంటాయి.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.
English summary
Masturbation is natural: Masturbation is normal, and it's a natural act. It is a common form of autoeroticism. Forget the myths and misconceptions regarding masturbation. It will never lead to infertility, sexual weakness or loss of libido. Even animals like monkeys, dogs, and cats masturbate.