•  

వల వేస్తే... పిట్ట పడాల్సిందే... ?

Threesome
 
నేటి జీవనంలో అనేక రకాల సెక్స్ సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా లైంగిక వేధింపులు, మానభంగాలు, స్త్రీల/పురుషుల పట్ల, పిల్లల పట్ల అసభ్య ప్రవర్తనల వార్తలు వింటున్నాం. కనుక ప్రతి ఒక్కరూ అట్టివారు తగిలితే, భాధ్యతాయుతంగా సమాజంపట్ల వారి భాధ్యత ఏంటనేది గుర్తింపచేయాలి. అసలు సెక్స్ పిచ్చి పట్టడమంటే ఏమిటి? కొంతమంది దీనిని మానసిక రుగ్మతగా భావిస్తారు. మరికొందరు దీనిని వ్యక్తిత్వ అసమతుల్యతగా పరిగణిస్తారు. ఎవరెన్ని పేర్లు పెట్టినప్పటికి కొంతమంది వ్యక్తులలో అసాధారణ రీతిలో లైంగిక కోర్కెలు కలుగుతుంటాయనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఆ టైపు వారు ఏ విధంగా వుంటారు, వారు సమాజంతో ఎదుర్కొనే పరిస్ధితులేమిటి తెలుసుకోండి.

1. డబుల్ స్టాండర్డ్స్ - ఈ రకమైన వ్యక్తులు చాలావారకు తమ లైంగిక జీవితాన్ని రహస్యంగా గడపటానికి ప్రయత్నిస్తూంటారు. సీక్రెట్ గా స్ట్రిప్ క్లబ్ లకు వెళ్ళడం, విపరీతంగా బూతు సినిమాలు చూడటం చేస్తారు.
2. కొంతమంది వ్యక్తిగత సంబంధాలను కూడా అతి కష్టం మీద నిర్వహిస్తారు. అబద్ధాలు ఎక్కువ చెప్పేస్తారు.
3. రిస్కు తీసుకోడం వీరికి ఒక ఫన్ గా వుంటుంది. పబ్లిక్ ప్లేస్ లలో సెక్స్ చేయటానికి, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించటానికి కూడా వీరు వెనుకాడరు.
4. ఎంత ఫన్ గా భావించినప్పటికి, తప్పు జరిగిందంటే గిల్టీగా భావిస్తూ డిప్రెషన్ వంటి వాటికి కూడా గురవుతారు.
5. తరచుగా సెక్స్ టాయ్ ల కొరకు చూస్తారు. కొత్తదనాలకొరకు కోరతారు.
6. రిస్క్ తీసుకుంటారు కనుక పట్టుబడిపోవటం, మర్యాద పోగొట్టుకోవడం వంటివి వీరికుంటాయి.
7. తమకు సమీపంలో వున్నవారిని రతి అవసరమున్నా లేకపోయినా వారి శరీరాన్ని ఇక్కడా, అక్కడా ముట్టుకొని ఇబ్బంది కలిగిస్తారు.
8. వివిధ పార్టనర్లతో సెక్స్ జరిపేటపుడు సురక్షిత విధానాలు ఆచరించరు కనుక సుఖవ్యాధులకు వీరు నిలయంగా కూడా వుంటారు.

ఇట్టివారి ప్రవర్తన సరి చేయాలంటే, వారిని ఆ మూడ్ నుండి బయటపడేయాలంటే మొదటగా వారి అంగీకారం వుండాలని, వారిని సరైన శిక్షలకు గురిచేస్తే తప్ప వారు ఆ ప్రవర్తన మార్చుకోలేరని, అటువంటపుడు భాగస్వామి సహకారం అత్యవసరమని, వీరు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే తగిన పరిష్కారాలకు లోనవుతారని మానసిక శాస్త్రవేత్తలు చెపుతారు. ఈ రకమైన ప్రవర్తనను మార్చటానికి మందులు కూడా వున్నాయని వాటిని ఉపయోగించి తమ ప్రవర్తన సరిచేసుకోవచ్చని కూడా తెలుపుతున్నారు.

English summary
A person will keep indulging in these pleasurable activities till the time they are caught. They will just not change their behaviour till the time they come under the scanner. His/her partner's support and motivation are definitely required in such a situation. More than often experts are required in such situations. There are medicines that are given to control your sexual behaviour and they do help a lot."
Story first published: Wednesday, December 28, 2011, 15:09 [IST]

Get Notifications from Telugu Indiansutras