చాలా సర్వేలు ఒక గట్టి సంబంధం ఏర్పడాలంటే ఒక్కరోజు రతి బాగా సహకరిస్తోందని చెపుతున్నాయి. మహిళలు 44 శాతం ఈ రతి జరిగిన తర్వాత తమ పురుష స్నేహితులకు కట్టుబడి వుండగా, పురుషులు 25 శాతం తమ మహిళా స్నేహితులకు కట్టుబడి వున్నారని సర్వే చెపుతోంది. స్నేహితులుగా కాకుండా కొద్దిపాటి పరిచయం వుంటే కాలు ఒక్క రాత్రి రతి జరిపిన వారు, మహిళలలో 30 శాతం, పురుషులలో 43 శాతం తమ సంబంధాలకు కట్టుబడి వున్నారట.
అయితే, ఈ రకమైన భావనలను వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. ఒక్కరాత్రి సెక్స్ చేస్తే చాలు, సుఖ వ్యాధులు జీవితాంతం వెన్నాడుతూంటాయనుకునేవారు కూడా లేకపోలేదు. మరి కొందరు ఈ ఒక్కరాత్రి రతిని తేలికగా తీసుకుని ఉదయం అయ్యే సరికి మర్చిపోయే టట్లు కూడా వుంటారు. అదనపు సౌకర్యంతో ఒక ఫ్రెండ్ అనే భావన దీర్ఘకాలంగా యువతలో బలపడింది. తాత్కాలికంగా సెక్స్ అవసరం గడిచిపోతున్నప్పటికి పరిపక్వంగా ఆలోచించే మైండ్ మాత్రం ఈ ఒక్క రాత్రి సెక్స్ కు వ్యతిరేకంగానే వుంది.
విచ్చలవిడిగా తిరిగేసే వారు చివరకు విలువలేనివారుగా కూడా అయిపోతారని భావిస్తున్నారు. మీకు మీరు శరీరాన్ని పాడు చేసుకోవడమే నంటున్నారు. అయితే మరి కొందరు, సెక్స్ వరకు రానియకుండానే స్నేహంతోనే సంబంధాన్ని గడిపే వారు కూడా వున్నారు. డేటింగ్ లు చేస్తూ సంబంధాలను బలపరచుకున్న వారెంత సంతోషంగా వుంటారో, సాధారణంగా వైవాహిక జీవనంలో సంబంధం ఏర్పరచుకున్న వారు కూడా అంతే సంతోషంగా వున్నారని కూడా సర్వే తెలిపింది. కనుక ఒక్క రాత్రి సెక్స్ తో ఏర్పడే సంబంధాలు అరుదుగా వైవాహిక జీవనం వరకు వస్తున్నాయని, వివాహం తర్వాత విఫలమైన జంటలు కూడా వున్నారని. విఫలత పొందిన జంటలలోని పురుషులు, స్త్రీలు మరో మారు సంబంధాలలోకి దిగినప్పటికి దీర్ఘకాల సంబంధాలు నిర్వహించటం జరగటంలేదని సర్వే చెపుతోంది.