షేవింగ్: షేవింగ్ విధానం ఛాతి పై వెంట్రుకులను తొలగించటం సులువైన పని అంతేకాకుండా నొప్పి వంటి సమస్య ఉండదు. అయితే క్రీమ్ రాయకుండా షేవింగ్ చేసుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక క్రీమ్ ను ఛాతి భాగంలో ఆప్లై చేసి షేవింగ్ చేసుకోండి. అయితే ఈ విధానం వల్ల మీ సమస్యకు పూర్తిగా పరిష్కారం లభించదు.
ట్రిమ్మింగ్: టెక్నాలజీ పుణ్యమా అంటూ మనకు ట్రిమ్మర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానం ద్వారా మీ వెంట్రుకలను '0' సైజులో ట్రిమ్ చేసుకోవచ్చు. '0' సైజు ట్రిమ్మింగ్ వల్ల వెంట్రుకలను పూర్తిగా నియంత్రించలేపోయినా, ఎదుటి వారికి నచ్చేవిధంగా ఉంటుంది. వారానికి రెండు సార్లు ట్రిమ్ చేసుకోవచ్చు.
వ్యాక్సింగ్: ఈ విధానం నొప్పితో కూడికుని ఉంది. ఈ విధానం ద్వారా వెంట్రుకలను చర్మం నుంచి పూర్తిగా తొలగిస్తారు. 'వ్యాక్సింగ్'ను భరించలేమనుకున్న వారు సులువైన షేవింగ్, ట్రిమ్మింగ్ విధానాలను పాటించడం మేలు.
వెంట్రుకులను తొలగించే క్రీములు: ప్రస్తుతం మార్కెట్లలో వెంట్రుకలను తొలగించే క్రీములు లభ్యమవుతున్నాయి. అయితే ఈ విధానం వల్ల ఉపయోగం ఉన్నప్పటికి పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. వైద్యుల సూచనల మేరకు ఈ క్రీములను వాడటం మేలు. క్రీములలో కలిపే శక్తివంతమైన ఔషుధాలు చర్మ వ్యాధులకు గురి చేసే అవకాశముంటుంది.
లేజర్ చికిత్స్: ఖర్చుతో కూడుకున్న ఈ చికిత్స సమస్య నియంత్రణకు పూర్తిగా సహకరిస్తుంది. లేజర్ చికిత్స ద్వారా విడుదలయ్యే వేడి, శరీర రంథ్రాలను మూసివేయటంతో పాటు రోమాలను నియంత్రిస్తుంది. ఈ ప్రకృయ ద్వారా మీ సమస్యకు శాస్వుత పరిష్కారం లభిస్తుంది.