మలి వయసులో భర్తతో శృంగారం హానికరమని అనుకోవటం అవగాహన లేమితో అనుకునే మాటని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయుర్వేద శాస్త్ర రిత్యా దంపతులకు మానసిక ఆరోగ్యం బాగుండాలంటే శృంగారం చాలా అవసరం. ఇష్టపూర్వక రతి మానసిక ఆందోళణలను, ఒత్తిళ్లను దూరం చేస్తుంది.
సహజసిద్ధమైన శరీరక్రియా ప్రక్రియలకు మద్దతునివ్వటం తద్వారా మానసికోద్వేగాలను తొలగించుకుని 'తృప్తి'ని పొందటం వైద్యచికిత్సకు సంబంధించిన సూత్రాలు, ఆరోగ్యపరిరక్షణకు సాధనాలు. కాబట్టి శృంగార వాంఛలకు సహకరించాలే గాని తిరస్కరించకూడదు. దీనివల్ల భర్తలో కలిగే ప్రవర్తనాత్మక పతనానికి, ఆరోగ్య విచ్ఛిన్నతకు భార్యం కారణం కాకూడదు.
పురుషులకు డెబ్భై సంవత్సరాలు పైబడే వరకు శృంగార వాంఛలు కలగటం సహజం. స్త్రీలకు కూడా వయస్సు అడ్డంకి కాదు. వయసు పై బడే కొద్ది ఇతర వ్యాధులకు దరికి చేరకుండా ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మీ మలి వయసు జీవితం సుఖ సంతోషాలతో పరిపూర్ణమవుతుంది.