•  

డ్రైవింగ్ వేడికి ... పిల్లల పుట్టుడు గోవిందా!

Heated Car Seats May Affect Men's Fertility!
 
కారు సీటు వేడెక్కితే చలికాలంలో మీకు వెచ్చగా హాయిగానే వుంటుంది. కొద్దిపాటి ఆనందం కూడాను. అయితే ఈ ఆనందం...మీరు తండ్రి కాలేరని తెలుసుకుంటే ఆవిరైపోతుంది. తాజాగా జరిపిన ఒక పరిశోధనలో కారు డ్రైవింగ్ లో సీటు వేడికి పురుషులలోని వీర్యకణాల సంఖ్య తగ్గిపోతోందని పరిశోధకులు తేల్చారు.

ఆరోగ్యకర వీర్యకణాలు తయారవాలంటే సరైన టెంపరేచర్ 35 లేదా 36 డిగ్రీ సెల్సియస్ మాత్రమే. కూర్చున్న పురుషులకు టెస్టికిల్స్ బయటకు వేలాడుతూండటంతో, డ్రైవింగ్ చేసే వారి ఈ శరీర భాగం వేడెక్కిన కారు సీటునుండి అధిక ఉష్ణోగ్రత తీసుకుని వీర్యకణాలకు హాని కలిగిస్తోందని తేలింది. నడిచే కారులో వేడెక్కిన టెస్టికిల్స్ టెంపరేచర్ కొలిస్తే ఒక్క గంటలో అవి 37.3 డిగ్రీ సెల్సియస్ కు చేరాయట. గరిష్ట టెంపరేచర్ అంటే 39.7 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా వెళ్ళాయని సైంటిస్టులు చెపుతున్నారు. ఈ పరిశోధన జర్మనీలోని గీసెన్ యూనివర్శిటీ లో ప్రొఫెసర్ ఆండ్రియాస్ జంగ్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చెపుతున్నారు.

సీటు వేడెక్కకపోయినా, కారులో కూర్చుంటే చాలు టెస్టికిల్స్ త్వరగా వేడెక్కిపోతాయట. రోజూ కనుక పురుషుడు 3 గంటలు కారు డ్రైవ్ చేస్తే....ఇక ఆజంటలకు పిల్లలు పుట్టాలంటే దీర్ఘకాలం పడుతోందట. నానాటికి కార్లు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో, ఇదే పరిస్ధితి కొనసాగితే, దేశంలో మనుషులు తక్కువ కార్లు ఎక్కువగా పరిస్ధితి ఏర్పడుతుందో ఏమో చూడాలి?English summary
To test whether heated car seats might be raising scrotal temperatures above this threshold, Andreas Jung at the University of Giessen in Germany and his colleagues fitted temperature sensors to the scrotums of 30 healthy men, who then sat on a heated car seat for 90 minutes.
Story first published: Saturday, November 5, 2011, 14:43 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more