•  

కామసూత్రకు - అసభ్య సాహిత్యానికి తేడా ఏమిటి?

Difference between pornography and Kamasutra!
 
అసభ్య బూతు సాహిత్యమన్నా, కామసూత్ర అన్నా సభ్య సమాజం ఒకే రకంగా కనుబొమ్మలు ముడేస్తుంది. వినకూడని మాటలా భావిస్తుంది. అయితే, కామసూత్రకు బూతు సాహిత్యానికి చాలా వ్యత్యాసముంది. ఈ రెండిటికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరించి రతిక్రీడల పట్ల మీ అవగాహన ఉన్నత స్ధాయికి చేర్చటమే ఈ కధనం ఉద్దేశ్యం.

కామసూత్ర పురాతనకాలంలో కామసూత్రంగా చెప్పారు. మానవుల శృంగారపర ప్రవర్తనలపై భారతీయ ప్రాచీన సంస్కృతిలో క్రీ.శ. 4 వ శతాబ్దంలో వాత్సాయన మహర్షి వ్రాసినదే కామసూత్రం. దీనిలో 36 చాప్టర్లు వుండి రతిక్రీడకవసరమైన భంగిమలు, సూచనలు, వాటివెనుకగల ఉద్దేశాలు వివరిస్తుంది. కామసూత్ర మొత్తంగా 64 రతి భంగిమలు వివరిస్తుంది. ఎనిమిది రకాలుగా ఎలా ప్రేమను తెలియపరచవచ్చో వివరిస్తుంది. ఈ రతి భంగిమలను కామసూత్ర కళలుగాను రతిక్రీడ చర్యలను భగవంతునిలో లీనమైపోవటంగాను వర్ణిస్తుంది.

ఇక బూతు సాహిత్యమనేది వ్యాపార పరంగా కళలను, రచనలను సృష్టించడమే. రతి సంబంధిత వ్యవహారాలపై ప్రజలు ఆలోచింప చేస్తుంది. ప్రేరేపించి, రేకెత్తిస్తుంది. దీనినే ఇంగ్లీషులో పోర్నోగ్రఫీ అని కూడా అంటారు. ఈ బూతు సాహిత్యం చాలావరకు పురుషులకు సంబంధించినదిగా వుంటుంది. పురుషుల మహిళల నగ్న చిత్రాలు సన్నివేశాల తీవ్రత ఆధారంగా దీనిని సరళ సాహిత్యం, కఠిన సాహిత్యంగా కూడా వ్యవహరిస్తారు. ప్రస్తుత బూతు సాహిత్యం ఒక పెద్ద వ్యాపారంగా మారి ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ, బ్లూ ఫిలిమ్స్, బూతు కధలు, బూతు ఛాటింగ్, ఆన్ లైన్ బూతు చిత్రాలుగా కూడా ఎదిగిపోయింది. పిల్లలు, పెద్దలు ఒకరేమిటి, ప్రతి ఒక్కరూ విచక్షణా రహితంగా ఈ వ్యవస్ధలను దురుపయోగం చేస్తున్నారు.

కామసూత్రకు పోర్నోగ్రఫీకి మధ్యగల పెద్ద వ్యత్యాసం ఏమంటే పోర్నోగ్రఫీ అనేది రతిక్రీడ చర్యలపై కేంద్రీకరించగా, కామసూత్ర రతిక్రీడ చర్యలద్వారా ఆధ్యాత్మిక స్ధాయిలకు ఎదిగే చర్యలు చేస్తుంది. రతిచర్యల ద్వారా భగవంతునిలో లయమయ్యేటందుకు సహకరిస్తుంది. నేటి బూతు సాహిత్యం పురుషుల రతిక్రీడ ధ్యేయంగా పురుషులచే రచించబడగా, కామసూత్ర మహిళల కవసరమైన రతి నైపుణ్యాలతో కుటుంబ ఎదుగుదలే ధ్యేయంగా, భగవంతుని సృష్టికి మానవుడు సహకరించడేమే ధ్యేయంగా రచించబడింది. కామసూత్ర... ప్రధాన ఉద్దేశ్యం 80 శాతం వరకు పురుషులు, మహిళలు రతిక్రీడల ద్వారా ఆరోగ్యకర సంబంధాలు కలిగి, సమాజ అభివృద్ధికి తోడ్పడటం. వాస్తవానికి 'కామసూత్ర' రతి క్రీడల కళలను ప్రజలు మరింత ఉన్నతంగా ఆనందించేందుకు దోహదం చేస్తుంది.

పోర్నోగ్రఫీ లేదా బూతు సాహిత్యాన్ని ప్రపంచంలోని అనేక దేశాలు చట్టవ్యతిరేక చర్యలుగా ప్రకటించాయి. బూతు సాహిత్యం వివాహేతర సంబంధాలు కోరుతూ చదివే వారి మనోభావాలను అసభ్యతలతో నింపివేస్తుంది. కాని, కామసూత్ర ...తమ రతిక్రీడలను భాగస్వామికి మాత్రమే కట్టుబడి వుండమని బోధిస్తుంది. పోర్నోగ్రఫీ కల్పనలు, ఊహలకు తావిచ్చి మితిమీరిన రతి చర్యలకు దోహదం చేస్తుంది. దీని కారణంగా భాగ స్వాములు రతిక్రీడలలో రతి చేయటం పాపం అని కూడా భావించే అవకాశం కలిగిస్తోంది. అయితే, కామసూత్ర మాత్రం రతి చర్య పాపం కాదని, హద్దులు మీరి అనైతికంగా చేస్తే పాపమని చాటుతోంది.

కామసూత్ర ఆచరించేవారు భగవంతుని సృష్టి కార్యమైన రతిక్రీడల పట్ల తమకు గల దురభిప్రాయాలను తొలగించుకోవాలి. కామసూత్ర అనేది రతి ఆనందానికి ఒక టెక్నిక్స్ తో కూడిన గైడ్ వంటిది. రతి సాధానకు, చర్యలకు అవసరమైన రహస్యాలను బోధిస్తుంది. మీ ఇంద్రియాల ఆనందానికి మీరు ఆరాటపడుతూంటే సరైన దిశగా ప్రయాణించేందుకు పురుషులకు, స్త్రీలకు తమ ఆనందకర శృంగార జీవితంలో కామసూత్ర ఒక అధ్బుతసాధనం కాగలదు.



English summary
Society may have the same frown on their face as they hear the words 'Pornography' and 'Kamasutra'. In contrary to the popular belief there is vast difference between the concepts of pornography and Kamasutra. This article is an attempt to draw the difference between pornography and Kamasutra as well to raise your understanding of sexual plays to a supreme level.
Story first published: Wednesday, November 30, 2011, 11:55 [IST]

Get Notifications from Telugu Indiansutras