డైలీ మెయిల్ పత్రిక నిర్వహించిన ఒక తాజా సర్వే మేరకు ఎనిమిది శాతం మహిళలు తమ స్నేహితులతో రతిక్రీడలాచరించారట. అందుకు వారు వెల్లడించిన కారణం....స్నేహంలో సెక్స్ చేరితే స్నేహం మరింత బలపడుతుందని కూడా వారు భావించారు. మీరు అమితంగా ప్రేమించే వ్యక్తితో శారీరక సంబంధాలు పెట్టుకుంటంలో తప్పేమీ లేదని నేటి యువతీ యువకులలో చాలామంది భావన. అయితే ఈ రతి సంబంధం ఒక్కొక్కపుడు క్లిష్ట దశకు చేరచ్చు. అందుకు సిద్ధ పడాలి కూడాను.
ఇదే రకమైన భావనలతో, పోకడలతో నేటి చలన చిత్ర ప్రపంచం వివిధ రకాలుగా చిత్రాలు తీసి సొమ్ము చేసుకుంటోంది. యువతలో విచ్చలవిడి శృంగారాన్ని స్నేహం పేరుతో నింపుతోంది. యువత సెక్స్ సంబంధాలు పెట్టుకొన్నప్పటికి ఏ రకమైన ఇతర మనో భావనలు లేకుండా విడిపోవటం మరల వారి వివాహ జీవితాలు గడపటం కూడా జరుగుతోంది. వీరి కోర్కెలకు దీర్ఘకాల కమిట్ మెంట్ అంటూ ఏదీ లేదు. ఒకే భాగస్వామికి కట్టుబడి వుండాలనే నియమాలు కూడా లేవు. ఈ సంబంధాలను చాలామంది యువతరం 'ఇచ్చి పుచ్చుకోడం' గానే భావిస్తోందిగానీ అంతకు మించిన ప్రాధాన్యతలను ఇవ్వడంలేదు. స్నేహంలోని సెక్స్ తర్వాత స్నేహం విఫలమయితే విచారమే. ఇక ఆ విచారం భరించలేనిదిగా కూడా వుండవచ్చు.